Friday, April 19, 2024
- Advertisement -

ఉద్యోగాల‌కు ఎసురు పెడుతున్న రోబోలు…

- Advertisement -
E-commerce giant launches robot courier

రోజురోజుకి పెరిగిపోతున్న అధునిక టెక్న‌ల‌జీ పుణ్య‌మాని ప్ర‌పంచంలో అనేక ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ప్ర‌స్తుం అత్యాధునిక టెక్నాల‌జీతో రూపొందించిన రోబోల కాలం మొద‌ల‌య్యంద‌నే చెప్పాలి.ఇప్ప‌టికే వీటి సేవ‌లు అనేక సంస్థ‌లు వినియేగించుకుంటున్నాయి.

కృత్రిమ మేధస్సుతో పనిచేసే రోబోలు ఇప్ప‌టికే ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకే కాదు.. ఇప్పుడు కొరియర్‌ సర్వీసులో పనిచేసే ఉద్యోగులకు సైతం ఎసరు పెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే అమెజాన్‌ లాంటి ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థలు వారి ఆర్డర్లను ఆకాశ మార్గాన డ్రోన్ల సాయంతో డెలివరీ చేస్తున్నాయి. అయితే తాజాగా చైనాలో ఓ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ తమ ఆర్డర్లను రోడ్డుమార్గంలో రోబోతో డెలివరీ చేయిస్తోంది.

{loadmodule mod_custom,GA1}

జేడి.కామ్‌ అనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ ఈ నూతన డెలవరీ రోబోలను వినియోగంలోకి తీసుకొచ్చింది. నాలుగు చక్రాలతో డబ్బా మాదిరిగా ఉండే ఈ రోబో తొలి కొరియర్‌ను బీజింగ్‌లోని రెన్మిన్‌ యూనివర్శిటీలో డెలివరీ చేసింది. అంతేకాదు.. దేశంలోని పలు యూనివర్శిటీలకూ కొరియర్లను రోబోతో డెలివరీ చేయించారు.
ఈ రోబో ఆప్టిమల్‌ రూట్‌ ఆధారంగా నడుస్తుంది. కొరియర్‌ తీసుకునే వారికి గమ్యం స్థానం చేరుకునే ఐదు నిమిషాల ముందు సందేశం పంపుతుంది. వారిని ఫేషియల్‌ రికగ్నజైషన్‌ ద్వారా గుర్తించి కొరియర్‌ డెలివరీ చేస్తుంది. ఈ రోబోకు లేజర్‌ రాడార్స్‌.. కెమెరాలు అమర్చి ఉన్నాయి. దీంతో ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తూ.. ఏ వాహనానికి ఢీకొట్టకుండా ప్రయాణిస్తుంది.

{loadmodule mod_custom,GA2}

ఇప్ప‌టి వ‌ర‌కుగంటకు మూడు నుంచి నాలుగు కి.మీ తిరగగలిగే ఈ రోబో 6 నుంచి 20 కొరియర్లను డెలవరీ చేయగలుతుందట. వచ్చే ఏడాది 100కి.మీ ప్రయాణించేలా రోబోలను రూపొందించ‌నుంది.

{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}sduhP8npg6E{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -