Sunday, May 5, 2024
- Advertisement -

చివరికి రాష్ట్రపతి దిక్కు అయ్యారు..!

- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై విపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ను కలవనున్నాయి. చట్టాలను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరనున్నట్లు తెలిపాయి. ఐదుగురు నేతలు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతిని కలుస్తారని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే ప్రతినిధి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా విపక్ష పార్టీల తరపున హాజరుకానున్నట్లు వెల్లడించాయి.నేడు ఉదయం కేంద్ర కేబినెట్​ భేటీ కానుంది. రైతుల ఆందోళనలు సహా పలు కీలక విషయాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు మంత్రులు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళన 14వ రోజూ కొనసాగుతోంది. ఎముకలు కొరికే చలిలోనూ అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. సింఘు, టిక్రి, ఘాజిపూర్‌, నోయిడా సరిహద్దుల్లో రహదారులపై బైఠాయించిన రైతులు సాగు చట్టాలను రద్దు చేయాలని నినదించాయి. కొత్త చట్టాలను రద్దు చేయడం కుదరదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పిన నేపథ్యంలో రైతు సంఘాలు నేడు భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు సింఘు సరిహద్దు వద్ద సమావేశం కానున్న రైతు సంఘాలు.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నాయి.

Also Read

ఇంత చేసినా చలించరా మోదీజీ..!

టెలికామ్​ ఇండస్ట్రీపై నరేంద్రుడు సమావేశం

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ లో నేడే టీకా పంపిణీ..!

ఫోన్ తో కరోనా పరీక్ష..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -