Saturday, May 18, 2024
- Advertisement -

క్షుద్ర‌పూజ‌లు చేసిన పూజారి న‌ర‌శింహా…. క‌త్తి మ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -

విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ ఆల‌యంలో క్షుద్ర‌పూజ‌లు జ‌రిగాయాన్న వార్త‌లు స‌ద్దుమ‌నుగ‌క‌ముందే ఇప్పుడు మ‌రో సారి క్షుద్ర‌పూజ‌లు క‌ల‌కంరేగుతోంది. తాజాగా క‌త్తిమ‌హేష్ ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ క్షుద్ద‌పూజ‌లు చేశార‌ని క‌త్తి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. దానికి సంబంధించి త‌న వ‌ద్ద వీడియో సాక్ష్యం ఉందని ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ సంచలన ఆరోపణలు చేశారు.

ఓఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ప్రజా జీవితంలో ఉన్న పవన్ కల్యాణ్ గురించి చాలా భ్రమలు ఉన్నాయి. ఆ భ్రమలు కొన్ని నిజాలు కావు అని చెప్పడం నా ఉద్దేశం. పవన్ కల్యాణ్ దేవుడని, ప్రజా సేవ చేసేస్తున్నాడని భావించే వాళ్లకు అతనిలో ఉన్న మరో పార్శ్వం తెలియద‌న్నారు.

పవన్, త్రివిక్రమ్ క్షుద్ర పూజలు చేయడానికి వాళ్ల కారణాలు వాళ్లకు ఉండొచ్చు. విజువల్ గా నేను చూసిందైతే పూజలు..కొన్ని తాంత్రిక విధానాల్లో ఈ పూజలు చేశారు. ఆ పూజలు చేసిన పూజారి పేరు నరసింహ. ఆ పూజలు ఎక్కడ చేశారో నాకు తెలియద‌న్నారు. అవ‌స‌రం అయితే స‌ద‌రు ఛాన‌ల్ జ‌న‌సేన ఆఫీసుల‌కెల్లి ఇన్విస్టిగేష‌న్ చేసుచేస్తే అస‌లు విష‌యాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌న్నారు.

పవన్, త్రివిక్రంలు రెండు, మూడు సార్లు తాంత్రిక పూజలు చేసినట్టు తెలుసున‌న్నారు. క్షుద్ర‌పూజ‌ల‌కు సంబంధించి నా దగ్గర ఒక వీడియో మాత్రమే ఉంద‌న్నారు. శాక్తేయంగా, వైష్ణ వేయంగా చేసే పూజల మధ్య తేడాలు నాకు బాగా తెలుసు. తాంత్రిక పూజల్లో కూడా ఎలాంటి ముగ్గులు వేస్తారో కూడా నాకు తెలుసున‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను సమయం వచ్చినప్పుడు బయటపెడతా. సమాజాన్ని పక్కదోవ పట్టించే వ్యక్తులు పవన్, త్రివిక్రమ్మ న మధ్య నివసిస్తున్నార‌న్నారు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శనీయంగా మారుతుండటం చాలా ప్రమాదకరం’ అని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు క‌త్తి చేసిన వ్యాఖ్య‌లు ఎలాంటి ప‌రిస్థితుల‌కు దారితీస్తాయో చూడాలి. ఛాన‌ల్‌లో ఉండంగానే జ‌ల్సా టైమ్‌లో ద్వార‌కాతిరుమ‌ల ఐఎస్ జ‌గ‌న్నాధ‌పురంలో పూజ‌లు చేశార‌న్న ఛాన‌ల్ వ్యాఖ్య‌ల‌ను క‌త్తి మ‌హేష్ ఖండించారు. అది వేర‌ని నాద‌గ్గ‌ర ఉన్న క్షుద్ర‌పూజ‌ల‌ల‌కు సంబంధించిన వీడియో వేర‌న్నారు. వీట‌న్నింటిని చూస్తే జ‌న‌సేన పార్టీ ఆఫీసులో క్షుద్ర‌పూజ‌లు చేశార‌న్న అనుమానాలు క‌లుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -