Saturday, May 18, 2024
- Advertisement -

వాజ్‌పేయి మ‌ర‌ణానికి సంబంధించిన ఎయిమ్స్ వైద్యుల నివేదిక ఇదే

- Advertisement -

భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి ఇకలేరు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాజ్‌పేయి గురువారం కన్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణానికి సంబంధించిన ఎయిమ్స్ వైద్యులు ప్రెస్ రిలీజ్ ను విడుదల చేశారు. ఎయిమ్స్ కు చెందిన మీడియా మరియు ప్రొటోకాల్ డివిజన్ ఈ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. ప్రెస్ రిలీజ్ లోని సారాంశం ఇదే.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి తుదిశ్వాస విడిచారనే విషయాన్ని ఎంతో బాధతో తెలియజేస్తున్నాం. ఈ సాయంత్రం 5గంటల 5 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. జూన్ 11న వాజపేయి ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారు. ఎయిమ్స్ వైద్య బృందం పర్యవేక్షణలో గత 9 వారాలుగా ఆయన ఆరోగ్యం నిలకడగానే వుంది. అయితే ఊహించని విధంగా గత 36 గంటలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనను వెంటిలేటర్ పై ఉంచాం. ఆయన ప్రాణాలను కాపాడటానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ… చివరకు ఆయనను దక్కించుకోలేక పోయాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -