Wednesday, May 15, 2024
- Advertisement -

వాజ్ పేయ్ మరణంపై అనుమానం

- Advertisement -

ఏంటో.. ఈ దేశంలో ప్రముఖుల మరణాలపై కొందరికి అనుమానాలు వస్తుంటాయి. క్రమంగా అవి బలపడుతుంటాయి. ఎన్నాళ్లు గడిచినా సమాధానాలు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోతుంటాయి. ప్రస్తుతం దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ మృతిపైనా మహారాష్ట్రకు చెందిన, శివసేన పార్టీ అధికారిక పత్రిక సామ్నా ఎడిటోరియల్ లో పలు అనుమానాలు వ్యక్తం చేసింది. స్వరాజ్యం అంటే ఏంటి ? అనే హెడ్డింగ్ తో శివసేన రాజ్యసభ ఎంపీ, సామ్నా పత్రిక ఎడిటర్ సంజయ్ రౌత్ రాసిన సంపాదకీయంలో ఆయన పలు ప్రశ్నలు సంధించారు. వాజ్ పేయ్ ఆగస్టు 16నే చనిపోయారా ? లేక ఆగస్టు 15కు ముందే తుదిశ్వాస విడిచారా ? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆగస్టు 12 నుంచి వాజ్ పేయ్ ఆరోగ్యం మరింత విషమించింది. అనే వార్తలు వచ్చాయి. చివరికి ఆగస్టు 16న ఆయన తుదిశ్వాస విడిచారనే అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రధానిగా నరేంద్రమోడీకి ఈ ఆగస్టు 15 వేడుకలే చివరివి. ఒకవేళ ఆయన మళ్లీ 2019లో ప్రధాని అయితే మళ్లీ, ఆ హోదాలో ఎర్రకోటపై జెండా ఎగురేస్తారు. లేకపోతే మాత్రం ఆయనకు ప్రధాని హోదాలో ఇవే ఆఖరి వేడుకలు. అందుకే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా మోడీ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చేందుకు, ఆటంకాలు లేకుండా వాజ్ పేయ్ మరణవార్తను 16న ప్రకటించారా ? అనే ఘాటు ప్రశ్నలు సామ్నా పత్రిక ఎడిటోరియల్ లో సంజయ్ రౌత్ లేవనెత్తారు. దేశ ప్రజల కంటే ముందుగా మన నేతలు స్వరాజ్యం గురించి అర్ధం చేసుకోవాలని, ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంద్రాగస్టు నాడు మోడీ ప్రసంగానికి ఆటంకం లేకుండా ఆగస్టు 16న వాజ్ పేయ్ మరణించారనే వార్తను అధికారికంగా ప్రకటించారా ? అనే వివాదాస్పద ప్రశ్నలు వేశారు.

ఇంత వివాదాస్పద ప్రశ్నలు వేసినందుకు సామ్నా పత్రిక సంపాదకీయంపైనా, ఎడిటర్ సంజయ్ రౌత్ పైనా మామూలుగా అయితే బీజేపీ నేతలు విరుచుకుపడేవారే. కానీ శివసేన కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో కమలం పార్టీ నేతలు సంమయమనం పాటిస్తున్నారు. పైగా ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చి, సమాధానాలు చెబితే విషయం మరింత పెద్ద ఎత్తున చర్చకు దారితీసి, దేశవ్యాప్తంగా రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతుంది. అని ఆలోచించే బీజేపీ నేతలు కిమ్మనకుండా చూసీ చూడనట్టు ఉండిపోతున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అయినా మన దేశంలో వాజ్ పేయ్ మరణం తేదీపైనే కాదు. అనేకమంది ప్రముఖుల ఆఖరిస్వాసపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జయలలిత ఎలా చనిపోయారన్నదానిపైనా ఏళ్లు గడుస్తున్నా ఇంకా అనుమానాలు తీరలేదు. వైఎస్ ది హత్య అని కొందరు, కాదు ప్రమాదమేనని ఇంకొందరు ఇప్పటికీ వాదిస్తున్నారు. జయలలతిది సహజమరణమే అని కొందరు, లేదు ప్రీప్లాన్డ్ మర్డర్ అని మరికొందరు వాదిస్తున్నారు. ఇక పుట్టపర్తి సత్యసాయిబాబా మరణం తేదీపైనా అనేక అనుమానాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను కలిగిఉన్న బాబా మరణవార్తను, చనిపోయిన వెంటనే ప్రకటించేస్తే, తట్టుకోలేక గోప్యంగా ఉంచారనే వాదనా వుంది. ఆరోగ్యం బాగోలేదు, కోలుకున్నారు, మళ్లీ క్షీణించింది, మళ్లీ విషమించింది…అంటూ మెల్లగా భక్తులను మానసికంగా సిద్ధం చేశాకే బాబా ఇకలేరనే వార్తను అధికారికంగా ప్రకటించారనే వార్తలనూ కొట్టిపారేయలేం. అందుకే మన దేశంలో ప్రముఖుల మరణాలు, ఆఖరిశ్వాస తేదీలు కొన్ని సందర్భాల్లో ఏళ్లు గడుస్తున్నా సమాధానాలు దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోతుంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -