Monday, April 29, 2024
- Advertisement -

‘వైఎస్ఆర్’ బ్రాండ్ డ్యామేజ్ చేస్తుంది ఎవ్వరు..? ఎందుకు..?

- Advertisement -

వైఎస్ఆర్ అంటే ఓ వ్యక్తి కాదు ఓ బ్రాండ్.. అలాంటి వైఎస్ కుటుంబంకు ఎమైంది..? ఓ పక్క అన్నను కాదని షర్మిల పక్క రాష్టం తెలంగాణలో పార్టీ పెట్టి నానా యాగీ చెస్తుంది. మరో పక్క వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు.. రోజకో కథలతో ’వైఎస్ఆర్’ బ్రాండ్ డ్యామేజ్ చేస్తున్నాయి. దీనికి కారణం ఎవ్వరు..? ఎందుకు ఇలా జరుగుతుంది..? అసలు వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతుంది…? ఎందుకు వైఎస్ కుటుంబంలో ఈ అలజడి..? ఇప్పుడు దీనిపైనే తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసిన చర్చ జరుగుతుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకు గానూ ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడు అయన కు ఉంటాయి.. ఇప్పటికి రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం ప్రజలు చుపిస్తున్నారంటే అయన చేసిన సేవ అలాంటిది.. ఉచిత విద్య దగ్గరి నుంచి, అంబులెన్సు లు, ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలు ప్రజలకు ఎంత లబ్ది చేకూర్చాయి అందరికి తెలిసిందే.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలను ఉపయోగించుకుని బాగుపడ్డవారే. ప్రపంచం మొత్తం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని ఇప్పటికీ కొనియాడుతుంది.

అయితే సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్రాణాలు విడిచిన అభిమానుల కుటుంబాల‌ను పరామ‌ర్శించేందుకు జ‌గ‌న్ ఓదార్పు యాత్ర మొద‌లు పెట్టారు. అయితే ఆక్ర‌మాస్తుల కేసులో జ‌గ‌న్ జైలుకు వెల్ల‌డ‌తో అప్పటి వరకు ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ష‌ర్మిల, జ‌గ‌న్ బాద్య‌త‌ను చేపట్టి ’అన్న వదిలిన బాణం’ అంటు ఓదార్పు యాత్ర‌ను కొన‌సాగించారు.

2014 ఎలెక్ష‌న్ల స‌మ‌యంలో జ‌గ‌న్‌ అతి విశ్వాసంతో ఓటమి పాలయ్యారు అనే విమర్శకూడా ఉంది. తరువాత జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేసి.. ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌ చెసి.. 2019లో జరిగిన ఎన్నికల్లో భారీ విజయంతో అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. తర్వాత వైఎస్ ష‌ర్మిల ప్ర‌త్య‌క్ష‌రాజ‌కీయాల‌కు కొంత కాలంగా దూరంగా ఉండంతో అన్న చెల్లిల మ‌ధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. విప‌క్ష‌పార్టీలు జ‌గ‌న్ త‌ల్లిని,చెల్లిని రాజ కీయాంగా వాడుకొని ప్ర‌స్తుతం ప‌క్క‌న పెట్టార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి.

షర్మిల లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ఉందాతనం ఎక్కడ..?
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ‘వైఎస్ఆర్ టీపీ’ షర్మిల పెట్టారు. మరో వైపు అప్పటి వరకు వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ కూడా పదవికి రాజీనామా చేసి తన కూతురు షర్మిలతోనే ఉంటానని చెప్పింది. దీంతో విమ‌ర్శ‌లకు మరింత భలం చేకురింది. ఇదిలా ఉంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఎదో ఒక విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకు పడుతు రోడ్డెక్కి నానా యాగీ చెస్తు.. మూడు దర్నాలు.. ఆరు అరెస్టులు గా సాగుతుంది షర్మిల రాజకీయం. పార్టీ పెట్టి మూడేళ్లు అవుతున్న పెద్ద చేరికలు గుర్తింపు రాలేదు. ఇక్కడే అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తు.. ముక్కు మీద వేలు వేసుకునేలా చేస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ఉందాతనం ఎక్కడ..? షర్మిలకు ఎందుకీ పరిస్థితి..? ఎవరి కోసం..? అంటు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలే కాకుండా పక్క రాష్ట్రా ప్రజలుకూడా గుసగుసలాడుతున్నారు.

మరో పక్క వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు…
2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పెను సంచలనంగా మారిన సంగతి విధితమే. ఈ హత్య జరిగి నాలుగేళ్ల పూర్తి కావొస్తున్న ఇంతవరకు ప్రధాన నిందితులెవరనేది మిస్టరీగానే ఉంది. రోజుకో మలుపు తిరుగుతున్న వైఎస్ఆర్ కుటుంబీకులే ఒకరిపై ఒకరు నిందలు విసురుకుంటూ రోజు వార్తలు ఉంటున్నారు. అవినాష్ రెడ్డి, సునీతా పోటా పోటిన ప్రెస్ మీట్ పెట్టి విమర్శించు కుంటున్నారు. ఈ విషయంపై కూడా అంటు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలే కాకుండా పక్క రాష్ట్రా ప్రజలుకూడా గుసగుసలాడుతున్నారు.

ఓ పక్క చెల్లి రోడ్డెక్కి రాజకీయం.. మరో పక్క బాబాయ్ వివేకా హత్యకేసు జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇలా నిత్యం వార్తల్లో వైఎస్ఆర్ కుటుంభం ఉంటు.. వైఎస్ఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది.. ఎందుకు ఇలా జరుగుతుంది.. దీనికి కారణం ఎవ్వరు.. అంతే కాదు ’వైఎస్ఆర్’ బ్రాండ్ డ్యామేజ్ చేసేలా ఈ రెండు సంఘటనలు ఉన్నయి. ఇది రాజకీయ శక్తుల పని లేక కుటుంబ కలహాల అంటు తెలుగు రాష్ట్రాలలో జోరుగా చర్చ జరుగుతుంది. చూడాలి మరి దీని ప్రభావం ’వైఎస్ఆర్’ బ్రాండ్ పై, 2024 ఎన్నికలపై ఏ మాత్రం ఉంటుందో…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -