Sunday, May 19, 2024
- Advertisement -

డిప్యూటీ మేయర్ కు కరోనా

- Advertisement -

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకీ అంతకంతకు వికృతరూపం ప్రదర్శిస్తోంది. కరోనాతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులను కరోనా వణికిస్తుంది. ఇప్పటికే పలువురు నేతలు కరోనా కాటుకు బలి అయ్యారు.

తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. జ్వరం, దగ్గు ఉండడంతో ఆమెకు కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె హూం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తనని కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరారు. జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.

ఇక రాష్ట్రంలో నిన్న కొత్తగా 10,122 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,11,905కు చేరింది. ఇందులో 3,40,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 52 మంది మృతిచెందడంతో మృతుల సంఖ్య 2094కు చేరింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1440 కేసులు రికార్డయ్యాయి.

అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!

థానేలో మరో ఘోరం.. ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

దుమ్మురేపుతున్న ‘టక్ జగదీష్’ టీజర్..!

.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -