Wednesday, May 1, 2024
- Advertisement -

థానేలో మరో ఘోరం.. ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

- Advertisement -

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. వరుసగా ఆరో రోజూ మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు వేలకుపైగా మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే ఈ మద్య కోవిడ్ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదాల్లో కోవిడ్ పేషెంట్స్ మరణిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని థానేలో విషాదం చోటుచేసుకుంది.

ఇక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈ తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు రోగులు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 20 మందికిపైగా రోగులను తరలించారు.

ఈ క్రమంలో మరో ఆసుపత్రికి తరలిస్తున్న నలుగురు రోగులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ముంబ్రా-కల్వా ఎమ్మెల్యే, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర అవహద్ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

దుమ్మురేపుతున్న ‘టక్ జగదీష్’ టీజర్..!

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..

సుమ తర్వాత నేనే.. వాళ్ళలా తప్పులు చేయనంటున్న యాంకర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -