Sunday, May 5, 2024
- Advertisement -

నిలకడగా పసిడి ధర.. పెరిగిన వెండి!

- Advertisement -

గత కొన్ని రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం ఎలాంటి మార్పులు లేకుండా నిలకడగా ఉన్నాయి. గురువారం మార్కెట్లు స్థిరంగా ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కదలిక లేకుండా ఉన్నాయి. బంగారం ధరలు ఈ రోజుకి మార్పులు లేవు. మరో వైపు వెండి ధరలు కొద్దిగా పెరుగుదల కనబరిచాయి.

పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర 47,500 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 52 వేలరూపాయల మార్క్ నుంచి కొద్దిగా దిగువన 51,800 రూపాయలుగా నిలిచింది. ఇదిలా ఉంటే.. బంగారం ధరలు స్థిరంగా ఉంటె.. వెండి ధరలు మాత్రం పరుగులు తీశాయి.

కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 300 రూపాయలు పెరిగింది. దీంతో 74 వేల రూపాయల స్థాయిలోనే వెండి ధరలు ఉన్నాయి. ఈరోజు వెండి ప్రారంభ ధర కేజీకి 74,500 రూపాయల వద్ద కు ఎగబాకింది. మరోవైపు దేశరాజధాని న్యూఢిల్లీలో కూడా బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నాయి.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర 49,650 రూపాయల వద్ద నిలిచాయి. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శుక్రవారం నాటి ప్రారంభ ధర 54,160 రూపాయల వద్ద ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -