Wednesday, May 1, 2024
- Advertisement -

మ‌నుషుల్ని తినే ప‌ర్వ‌తం..!

- Advertisement -

పర్వతం ఏంటి మనుషుల్ని తినేయడం అని షాక్ అవుత‌న్నారా…! మీరు విన్నది నిజమే. ఇది మ‌ప దూశంలె రాదులేండి .నైరుతి బొలివియాలోని సెర్రోరికో అనే పర్వతం దాదాపు ఐదు శతాబ్దాల్లో కొన్ని లక్షల మంది ప్రాణాలను బలితీసుకుందట. దానికేమి శ‌క్తులు లేవు. కానీ అంతమందిని ఎలా పొట్టన పెట్టుకుందో తెలుసుకోవాల‌ని ఉందా….! అయితే ఇది చ‌ద‌వండి.

బొలివియాలోని సెర్రోరికో పర్వతంలో ఒకొప్పుడు వెండి నిక్షేపాలు అధికంగా ఉండేవి. అందుకే ఒకప్పుడు దీన్ని స్పానిష్‌ వాళ్లు ‘ధనిక పర్వతం’గా పిలిచేవారు. ఆ పర్వతంపై ఉన్న వెండిని కొల్లగొట్టేందుకు 1545లో తొలిసారిగా మైనింగ్‌ని ప్రారంభించారు. అందుకోసం అక్కడ స్థానికంగా ఉండే 30 లక్షల మంది ప్రజలను బానిసలుగా చేసుకున్నారు. వారితో బలవంతంగా కొండను తవ్వించి వెండి ఖనిజాన్ని వెలికితీయించేవాళ్లు.

అలా దాదాపు ఐదు శతాబ్దాలుగా ఆ మైనింగ్‌ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.దీంతో పర్వతంలో పెద్ద సొరంగాలు ఏర్పడ్డాయి. అప్పుడప్పుడు అవి కూలడంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ప్రమాదాలతోనే కాకుండా అధిక పని.. ఆకలి.. వ్యాధుల బారినపడి ఇప్పటివరకు కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

మైనింగ్ గ‌నుల‌ల్లో సరైన ప్రమాణాలు లేకపోవడంతో అందులోంచి వెలువడిన ధూళితో చాలామంది వూపిరితిత్తుల సంబంధిత వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అలా ఇప్పటివరకు 80 లక్షల మంది మరణించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కాగా నెలకు 14మంది వితంతువులుగా మారుతున్నారని స్థానిక వితంతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇంత మంది ప్రాణాలు తీసుకున్న ఈ పర్వతాన్ని ఇప్పుడు అంద‌రూ ‘మనుషుల్ని తినే పర్వతం’గా పిలుస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -