Wednesday, May 15, 2024
- Advertisement -

భారత్ లోకి ప్రవేశించిన సైనికులు

- Advertisement -

చైనా. భారత్ కు పక్కలో బల్లెంలా తయారైన దేశం. ఎప్పుడు దేశంలో కొంతభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని కాచుక్కూర్చున చైనా అందుకోసం అనేక విఫలయత్నాలు చేస్తోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ ను సొంత చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఆ భూభాగంలోకి చైనా ప్రవేశించినట్లు భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 250 మంది చైనా సైనికులు భారత భూభాగంపై మూడు గంటల పాటు గడిపినట్లు తెలిసింది. సరిహద్దుల్లో అతిక్రమణ జరిగిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

అయితే ఇది తాత్కాలిక ఉల్లంఘనే అని కూడా పేర్కొన్నాయి. చైనాకు తమ నిరసన తెలియజేయాలని భారత్ నిర్ణయించింది. ఈ నెల 9 వ తేదిన చైనా సైనికులు భారత్ లో చొరబడినట్లు సమాచారం. అణు సరఫరా దారుల కూటమిలో భారతదేశం చేరడానికి చర్చలు జరుగుతున్న సమయంలో చైనా ఈ దుస్సాహసానికి పాల్పడింది.

అలాగే అమెరికా, ఇండియా, జపాన్ నావికాదళాలు ‘‘ఎక్స్ ఆపరేషన్ మలబార్’ ను ప్రారంభించడానికి ముందు చైనా ఇలా ప్రవర్తించింది. అరుణాచల్ ప్రదేశ్‌ గుండా సాగుతున్న 4,057 కి.మీ. పొడవున ఉన్న భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని పెంటగాన్ తన నివేదికలో అమెరికా కాంగ్రెస్ కు తెలిపింది. అలాగే అమెరికా రక్షణ మంత్రి అబ్రహం డెన్మార్క్ కూడా భారత సరిహద్దుల్లో చైనా సంచరించడాన్ని గమనించామన్నారు. నిజానికి అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమేనని ఆ దేశం ఎప్పటి నుంచో చెబుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -