Tuesday, May 21, 2024
- Advertisement -

ఆర్మీఛీప్ సిక్కింప‌ర్య‌ట‌న‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

- Advertisement -
Indian Army Chief Bipin Rawath says ready for war with china and pakistan

భార‌త్ ,చైనామ‌ధ్య మ‌రో సారి ఘ‌ర్శ‌న వాతార‌ణం నెల‌కొంది. ఇరు దేశాల మ‌ధ్య మాట‌ల యుద్ధంముదురుతోంది.భూటాన్‌లో రోడ్డు విషయంలో భారత్‌-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన నేపథ్యంలో భారత సైన్యాధిపతి బిపిన్‌ రావత్‌ గురువారం సిక్కిం పర్యటన చేపట్టారు.

సిక్కిం సెక్టార్‌లోని భూటాన్‌ భూభాగంలో చైనా సైన్యం రోడ్డు నిర్మిస్తుండటంతో చైనా-భారత్‌ సైన్యాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. చైనా రోడ్డు నిర్మాణాన్ని భూటాన్‌, భారత్‌ వ్యతిరేకిస్తున్నాయి. అయితే, చైనా మాత్రం భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చాయని నిందిస్తూ.. భారతీయులు చేపట్టే మానస సరోవర్‌ యాత్రను నిలిపేసిన సంగతి తెలిసిందే.

{loadmodule mod_custom,GA2}

సిక్కిం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆర్మీ ఛీఫ్ చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడ సంచ‌ల‌నంగా మారాయి. చైనా, పాక్‌తోపాటు భారత్‌ అంతర్గతంగా ఎదుర్కొంటున్న ముప్పుపై ఒకేసారి (టూ అండ్ హాఫ్ ఫ్రంట్ వార్) యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామన్న భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి చరిత్ర చెప్పిన పాఠాల గురించి తెలుసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
డోంగ్‌లాంగ్ ప్రాంతంలో ఇరు దేశాల దళాలు మోహరించడంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం భారత్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ఒకేసారి అటు పాక్, ఇటు చైనాతో యుద్ధం చేసేందుకు సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

Also read

  1. ఎదురుతిరిగి దాడి చేస్తే ఎలా ఉంటుందో పాక్‌కు రుచి చూపించింన భార‌త్‌ ఆర్మీ
  2. సీమాంత‌ర ఉగ్ర‌వాదానికి పాక్ స్వ‌స్తి ప‌ల‌కాలి…
  3. ఉగ్ర‌దాడులు జ‌ర‌గ‌చ్చు భార‌త్‌ను హెచ్చ‌రించి అమెరికా ఇంట‌లిజెన్సీ
  4. ఇది శాంపిల్ మాత్ర‌మే… పాక్‌కు భార‌త్ వార్నంగ్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -