Friday, May 3, 2024
- Advertisement -

టిబెట్ స‌రిహ‌ద్దుకు భారీగా బ‌ల‌గాల‌ను, యుద్ధ‌సామాగ్రిని త‌రలించిన చైనా..

- Advertisement -

గ‌త కొద్దిరోజులుగా సిక్కిం సరిహద్దులోని డోక్లాం వివాదంతో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఇవి ఇప్పుడు తారాస్థాయికి చేరింది. సరిహద్దు నుంచి భారత బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని లేదంటే సమస్యకు యుద్ధమే పరిష్కారమని చైనా పదేపదే హెచ్చరికలు చేస్తోంది. మాట‌ల‌తోపాటు చేతుల్లో చూపిస్తోంది. చైనా తన సైన్యాన్ని, భారీగా మిలిటరీ ఆయుధాలను, పరికరాలను టిబెట్‌ సరిహద్దు దిశగా తరలించినట్లు వస్తున్న కథనాలు చర్చనీయాంశంగా మారాయి.
పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సైన్యాన్ని, వేల టన్నుల కొద్ది మిలిటరీ పరికరాలు, ఆర్మీ వాహనాలను చైనా జూన్‌ చివర్లో టిబెట్‌ సరిహద్దు దిశగా తరలించినట్లు హాంకాంగ్‌కు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొంది. రోడ్డు, రైలు మార్గం ద్వారా వీటిని తరలించినట్లు వెల్లడించింది. భారత్‌తో సమస్యను పరిష్కరించేందుకు చైనా సైన్యం టిబెట్‌ సరిహద్దు వద్ద మోహరించినట్లు హాంకాంగ్‌ మీడియా తన కథనంలో పేర్కొంది.దీన్ని బ‌ట్టి చూస్తె యుద్ధానికి రెడీ అవుతున్న‌ట్లు సమాచారం.
అయితే భార‌త్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న ఉద్రిక్త‌త‌ను నిశితంగా ప‌రిశీలిస్తోంది. ముందుగా భారత్‌-చైనా మధ్య వివాదం దౌత్యపరమైన చర్చలతోనే పరిష్కారమవుతుందని భారత్‌ భావిస్తుండటం గమనార్హం. ఈ మేరకు సరిహద్దు వివాదం గురించి పూర్తి వివరాలను విదేశాంగశాఖ కార్యదర్శి జయశంకర్‌ మంగళవారం నాడు పార్లమెంటరీ ప్యానెల్‌కు వివరించారు.
ఇప్ప‌టికే స‌రిహ‌ద్దుల్లో భార‌త్‌కూడా భారీగా బ‌ల‌గాల‌ను మోహ‌రించింది.యుద్ధం వస్తే తాము వెనుకాడబోమని భారత్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు ఎలాంటి ప‌రినామాల‌కు దారి తీస్తాయోన‌ని ఉత్కంఠ‌నెల‌కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -