Sunday, May 19, 2024
- Advertisement -

ఆర్మీ దెబ్బ‌కుఏడుగురు పాక్ రేంజ‌ర్లు హ‌తం…

- Advertisement -

పదే పదే కాల్పుల విరమణకు పాల్పడుతోన్న పాకిస్థాన్‌‌కు భారత్ తిరుగులేని బదులిచ్చింది. జమ్మూ కశ్మీర్లోని వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ కాల్పులకు తెగబడగా.. భారత సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు ప్రాణాలు వదిలారు. మరో నలుగురు పాకిస్థానీ సైనికులు గాయపడ్డారని తెలుస్తోంది. పూంచ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ కాల్పులకు తెగబడటంతో దీటుగా బదులిచ్చామని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది.

సోమవారం ఉదయం నియంత్రణ రేఖ వెంబడి అనుమానాస్పద స్థితితో సంచరిస్తున్న పాక్‌ సైనికులను గమనించిన సిబ్బంది భారత సైన్యాన్ని అప్రమత్తం చేశారు. దీంతో జవాన్లు రంగంలోకి దిగగా.. పాక్ సైనికులు కాల్పులు ప్రారంభించారు. ఇక ప్రతిదాడి భాగంగా భారత సైన్యం వారిని కాల్చిచంపింది.

పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతునిస్తే.. గట్టిగా బదులిస్తామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించిన నేపథ్యంలో భారత ఆర్మీ ఏడుగురు శత్రు సైనికుల్ని మట్టుబెట్టడం విశేషం. భారత్‌లోకి చొరబాట్లు అధికం అవుతున్నాయి. పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఇలాగే కొనసాగితే మేం మరింత బలంగా శత్రువు బదులిస్తాం అని రావత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -