Wednesday, May 15, 2024
- Advertisement -

జనసేన ఆఫీస్ ఆక్రమణ నిజమే…… రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేయించిన పవన్

- Advertisement -

నీతి, నిజాయితీ అని చెప్పుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జనసేన అధినేతకు ఫస్ట్ స్ర్టోక్ తగిలింది. జనసేన పార్టీ ప్రధాన ఆఫీస్ స్థల వ్యవహారం విషయంలో ఆక్రమణ, వివాదాలు నిజమే అని తేలిపోయింది. మొత్తం వ్యవహారం బయటపడే పరిస్థితి తలెత్తడంతో రాత్రికి రాత్రే ఊహించని నిర్ణయం తీసుకన్నాడు పవన్.

ఇప్పటికే భజన రాజకీయాల పుణ్యమాని ప్యాకేజ్ పొలిటీషియన్‌గా పేరు తెచ్చుకున్న పవన్‌కి ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. పవన్ వేసిన మొదటి అడుగే అవినీతి, ఆక్రమణ వ్యవహారంగా బయటపడిపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించాలనుకున్న పవన్ అమరావతి సమీపంలో మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి పూనుకున్నాడు. అయితే ఆ వెంటనే కొంతమంది ముస్లిములు ఆ స్థలం వాళ్ళకు చెందినదని, అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. విషయం కోర్టుల వరకూ వెళ్ళింది. ఈ ఆరోపణలన్నింటినీ జనసేన ప్రతినిధులు ఖండించారు. ఎలాంటి ఆక్రమణలూ జరగలేదని టివి స్టూడియోల్లో కూర్చుని వాదించారు. అయితే బాధితులు మాత్రం విషయాన్ని హైకోర్టుకు తీసుకెళ్ళారు. ఈ నేపథ్యంలో తెరవెనుక ఏం జరిగిందిో…..పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడ్డాడో తెలియదు కానీ రాత్రికి రాత్రే జనసేన ఆఫీస్ నిర్మాణ సామాగ్రిని మంగళగిరి కార్యాలయ స్థలం నుంచి తీసేయించాడు. జనసేనకు సంబంధించిన ప్రాపర్టీ మొత్తం తీసుకెళ్ళిపోయారు. స్థలాన్ని ఖాళీ చేశారు. ఆ రకంగా నిర్మాణదశలో ఉండగానే పార్టీ ప్రధాన ఆఫీసును ఎత్తేయించిన మొదటి నాయకుడు పవన్ కళ్యాణ్ అయ్యాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికీ చాలా సందేహాలు మిగిలి ఉండడం గమనార్హం. ఎలాంటి ఆక్రమణలూ జరగలేదని జనసేన పార్టీ చెప్పింది. ఇప్పుడు ఉన్నపళంగా పార్టీ ఆఫీసును ఎత్తేయడానికి కారణం ఏంటి? ఈ చర్యను ఆధారంగా చేసుకని ఆక్రమణ నిజమని భావించాలా?

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయ నాయకుడిగా రోజు రోజుకూ దిగజారిపోతూ ఉన్నాడు. చంద్రబాబు, కెసీఆర్‌ల భజనతో కమెడియన్ అయిపోయాడు. ఇప్పుడు బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి తీవ్రస్థాయిలో అన్యాయం జరిగినప్పటికీ ధైర్యంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఇలాంటి సంకటస్థితిలో ఇప్పుడు జనసేన ప్రధాన కార్యాలయం జెండా పీకేయించిన వ్యవహారం ప్రజల్లో బోలెడు సందేహాలను రేకెత్తిస్తోంది. మొత్తానికి నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలు అని చెప్పి మాటలు చెప్పిన పవన్ కళ్యాణ్ అసలు రంగులు మాత్రం చాలా త్వరగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయన్నది నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -