Wednesday, May 15, 2024
- Advertisement -

మెరీనాబీచ్‌లో ప్ర‌భుత్వ‌లాంఛ‌నాల‌తో ముగిసిన క‌రుణానిధి అంత్య‌క్రియ‌లు….

- Advertisement -

డీఎంకే అధినేత కరుణానిధి అంత్యక్రియలు ముగిశాయి. మెరీనా బీచ్ లోని అన్నా స్వ్కేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బంగారుపూత పూసిన శవపేటికలో కరుణానిధి పార్థివ దేహాన్ని ఖననం చేశారు.

Image result for karunanidhi-funeral-kalaignar-laid-to-rest-at-marina-beach-with-full-state-honours

అంతకుముందు, కరుణానిధికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీకి చెందిన నేత గులాం నబీ ఆజాద్, టీడీపీ నేత చంద్రబాబు, మాజీ ప్రధాని దేవెగౌడ తదితరులు నివాళులర్పించారు. ఆ తర్వాత కరుణానిధి కుటుంబసభ్యులు, సన్నిహితులు తదితరులు నివాళులర్పించారు. కరుణానిధికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Image result for karunanidhi-funeral-kalaignar-laid-to-rest-at-marina-beach-with-full-state-honours

ఏడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగి జాతికి సేవలందించిన కురువృద్ధుడికి గౌరవ సూచకంగా సైనికులు సగర్వంగా వందనం సమర్పించి, గాల్లోకి కాల్పులు జరిపి నివాళి అర్పించారు.

Image result for karunanidhi-funeral-kalaignar-laid-to-rest-at-marina-beach-with-full-state-honours

కవి, కళాకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన ధీశాలి, తమిళ ప్రజల పక్షాన నిలిచిన పోరాట యోధుడు తరలిపోయారు. బతికినంతకాలం ద్రవిడ వాదమే నినాదంగా, హేతువాదం పునాదిగా దక్షిణాదిన ఎలుగెత్తి ద్రావిడ జెండా ఎగరేసిన ఉద్యమ సూరీడు.. లక్షలాది అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ అనంతలోకాలకు వెళ్లిపోయారు.

Image result for karunanidhi-funeral-kalaignar-laid-to-rest-at-marina-beach-with-full-state-honours

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -