Wednesday, May 15, 2024
- Advertisement -

కరుణానిది కి సీరియస్ ? పరిస్థితి ఏంటి ?

- Advertisement -
Karunanidhi Health COndition

ఒక రాష్ట్రానికి చెందిన అధికార పక్షం నేత , ప్రతిపక్షం నేత రాష్ట్రానికి రెండు కళ్ళుగా ఉన్నవారు ఒకేసారి తీవ్ర అనారోగ్యానికి పాలు అవ్వడం చాలా అరుదుగా జరిగే విషయం . తమిళనాట ప్రస్తుతం అదే పరిస్థితి కనపడుతోంది. 75 రోజుల పాటు ఆసుపత్రిలో అనారోగ్యం తో పోరాటం చేసిన అన్నాడీఎంకే అధినేత జయలలిత అనంత లోకాలకి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే.అమ్మ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వేళలోనే.. తమిళనాడు విపక్షనేత.. డీఎంకే అధినేత కరుణానిధి సైతం అనారోగ్యానికి గురి కావటం తెలిసిందే.

93 ఏళ్ల కరుణానిధి శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు సూచించిన మందుల్ని వేసుకున్నారు. అవి వికటించటంతో ఒళ్లంతా బొబ్బలు రావటం.. తీవ్ర అనారోగ్యానికి గురి కావటం జరిగింది. ఆ సమయంలో ఆసుపత్రిలో చేర్చి.. చికిత్స అందించటంతో కోలుకున్నారు. దాదాపు ఆరు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన.. డిసెంబరు 7 సాయంత్రం డిశ్చార్జ్ చేశారు.ఇదిలా ఉంటే గురువారం సాయంత్రం కరుణ అనారోగ్యానికి గురి కావటంతో ఆయన్ను హుటాహుటిన కావేరీ ఆసుపత్రికి తరలించారు.

తాజాగా.. తీవ్రమైన జలుబుతో ఆయనకు ముక్కలో నుంచి అమర్చిన ట్యూబ్ ను తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శ్వాస తీసుకోవటానికి తీవ్ర ఇబ్బందులకు గురి కావటంతో.. ట్రక్యోస్టమీ పరికరాన్నిఅమర్చి.. కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. తొంభై ఏళ్ల వయసులో ఒకటికి నాలుగు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కరుణ కోలుకోవాలని.. ఎప్పటి మాదిరి ఆరోగ్యంగా తిరగాలని డీఎంకే నేతలు కోరుకుంటున్నారు. అమ్మ లేని తమిళనాడుకు.. పెద్ద దిక్కుగా కరుణ అవసరం ఉందని చెప్పక తప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -