Tuesday, May 14, 2024
- Advertisement -

కాళీమాతా అభిషేకానికి భారీగా మ‌నుషుల ర‌క్తం …

- Advertisement -

దేవుళ్లకు పాలు, నెయ్యి, పెరుగు, కుంకమ ఇలా ఎన్నో రకాల వస్తువులతో అభిషేకాలు చెయ్యడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. కొన్ని ఆలయాల్లో అయితే జంతువుని బలిచ్చి ఆ రక్తంతో అభిషేకం చేస్తుంటారు. మ‌నుషుల ర‌క్తంతో అభిషేకాలు చేయ‌డం ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల్లోనే చూశాం. కాని నిజంగా ఇలాంటిది జరుగుతుందంటే నమ్ముతారా… అసలు నమ్మరు. అయితే కేరళలో అలాగే జరుగుతోంది.

అక్కడి కాళీమాత ఆలయానికి అభిషేకం చేసేందుకు భారీగా రక్తం కావాలని, అందుకోసం భక్తులు వీలయినంత త్వరగా వారి రక్తాన్ని దానం చేసి పంపిచాలంటూ తిరువనంతపురం జిల్లా పరిధిలోని విధుర అనే గ్రామ ఆలయ అధికారులు బహిరంగంగా ప్రకటన చేశారు. పోస్టర్లు కొట్టించారు. ఈ ఆలయంలో ప్రతియేటా జరిగే ఉత్సవాల్లో భాగంగా రక్తాభిషేకం చేయాల్సి ఉన్నందున భక్తులంతా త్వరగా వారి రక్తాన్ని దానం చేసి ఆలయానికి పంపించాలంటూ అందులో ప్రకటించారు.

అంతేకాదు భక్తుల దగ్గర నుంచి ప్రభుత్వ ఆమోదం పొందిన డాక్టర్లే రక్తాన్ని భద్రంగా సేకరిస్తారని సూచించారట. మార్చి 12న సాయంత్రం 6గంటలకు ఈ ఉత్సవం జరగనుందట. ఈ ఉత్సవాన్ని మహాఘోర కాళీయజ్ఞంగా పిలస్తారు. 14 రోజుల పాటూ జరిగే ఈ ఉత్సవంలోని రెండో రోజే దీనిని నిర్వహిస్తారు. ఈ తంతును కాళీయుత్తు మహోత్సవం అంటారు. కాళీమాత ఆకలిని తీర్చే వేడుకగా దీన్ని పిలుస్తుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -