Sunday, May 19, 2024
- Advertisement -

కొంప‌ముంచుతున్న మేక‌ప్ పిచ్చి

- Advertisement -

తరచూ బ్యూటీ పార్లర్ కెళ్ళి అటెండెన్స్ వేసుకునేవారు.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం ఇది. ఫేషియల్ కోసం వాడే ప్రొడక్ట్స్ కారణంగా మానవాళికి జరిగే అపార నష్టం అంతా ఇంతా కాదు. మేకప్ సమయంలో ముఖాలను కప్పడం కోసం ‘షీట్ మాస్క్’ వాడడం తప్పనిసరి. కానీ.. వాడిన తర్వాత షీట్ మాస్క్ ని ట్రాష్ చేసి చక్కా వెళ్ళిపోతాం. అలా ఏర్పడ్డ ‘షీట్ మాస్క్ వేస్ట్’ ఏమ‌వుతుందో తెలుసా?

మాస్క్, దాన్ని చుట్టిన ప్లాస్టిక్ పేపర్, దీన్ని ప్యాక్ చేయడానికి వాడిన పౌచ్.. ఇటువంటి యాక్సెసరీస్ అన్నీ కలిపి గంపంత చెత్త అవుతుంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంచనా ప్రకారం ఒక్క అమెరికాలోనే 2015లో బ్యూటీ పార్లర్స్ నుంచి 77.9 మిలియన్ టన్నుల చెత్త చేరుకుందట. ఇవన్నీ డీకంపోజ్ అయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందో లెక్కే లేదు. ఇప్పటికే బిలియన్ల కొద్దీ టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ సముద్రంలో కలిసి పర్యావరణం కలుషితమవుతోందని గగ్గోలు పెడుతున్నాం. షీట్ మాస్క్ వాడకం విపరీతంగా పెరగడం కారణంగా ఈ సమస్యకు మరింత ఆజ్యం పోస్తున్నామన్నది నిజమేగా? మన అందం కోసం మానవాళి మనుగడతో చెలగాటమాడుతున్నామన్నది వాస్తవం కాదా? ఇది ఓన్లీ షీట్ మాస్క్ గురించి మాత్ర‌మే. ఇంకా ఏం ఏం వాడ‌తారో.. వాటి ఉప‌యోగాలు ఎంటో ఆ సుంద‌రాంగులే తెలుసుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -