Wednesday, May 15, 2024
- Advertisement -

హాకా భవన్ లో సెంటర్ ప్రారంభం

- Advertisement -

భరోసా సెంటర్ తో జంటనగరాల మహిళలకు రక్షణ కల్పించవచ్చునని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి అన్నారు. సైఫాబాద్ లోని హాకా భవన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ ను హోంమంత్రి ప్రారంభించారు. మహిళలను గౌరవించిన సమాజం అన్ని రంగాల్లోనూ బాగుంటుందని హోం మంత్రి అన్నారు.

తెలంగాణ జిల్లాల్లో మహిళలందరికి ధైర్యం కల్పించేందుకు షీ టీమ్స్ ఏర్పాటు చేశామని, అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు.  ఇవి విజయవంతమైనట్లుగానే డిజీపి అనురాగ్ శర్మ, కమిషనర్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భరోసా కేంద్రాలు కూడా విజయవంతం కావాలని మంత్రి ఆకాంక్షించారు.

భరోసా కేంద్రానికి ఆర్ధిక ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, నగర పోలీసుల పనితీరుకు ఢిల్లీలో కూడా ప్రశంసలందుతున్నాయని ఆయన చెప్పారు. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్  అమలు చేస్తామని ఆయన చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -