Tuesday, May 14, 2024
- Advertisement -

బాబు పైన మోడీ ప్రశంసల జల్లు

- Advertisement -

ప్రతిష్టాత్మక అమరావతీ నగర శంకుస్థాపన మహోత్సవానికి నరేంద్ర మోడీని ఆహ్వానించినట్లు ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రధాని మోడీ తో సమావేశం అయిన ఆయన డిల్లీ లో సమావేశం తరవాత మీడియా తో మాట్లాడారు. ఈ నెల 22న ఒక పర్యటన ఉన్నా దాన్ని క్యాన్సిల్ చేసుకుని మరీ మోడీ తన షెడ్యూల్ ని ఏపీ వైపుకు మళ్ళించారు అని. ప్రధాని తో పాటు గా కేంద్ర మంత్రులు అయిన రాజ్ నాథ్ సింగం అరుణ్ జైట్లీ లే కాకుండా బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీలని కూడా తాను స్వయంగా ఇళ్ళకు వెళ్లి మరీ ఆహ్వానాలు ఇచ్చాను అని. ప్రత్యేకంగా రాజధాని విశేషాలు వివరించి తప్పకుండా రావాల్సింది గా కోరాను అని బాబు చెప్పారు.

మరొక పక్క శంకుస్థాపన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి అని చెప్పిన బాబు, సంప్రదాయానికి తగ్గట్టుగా 16000 గ్రామాల నుంచి నీటినీ, మట్టినీ నిర్మాణం కోసం సమకూర్చడంలో యంత్రాంగం  గా ఉందన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అందరి భాగస్వామ్యం ఉండేలా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 

డిల్లీ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో నీతి అయోగ్ ముఖ్యమంత్రుల సబ్ కమిటీ ప్రధానిని కలుసుకుంది. స్వచ్చ భారత్ మీద నీతి అయోగ్ కి తమ నుంచి ఒక నివేదిక నే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీద  ప్రధాని ప్రసంసల వర్షం కురిపించడం విశేషం. గడువులోగా స్వచ్చ భారత్ నివేదిక ఇచ్చినందుకు ఆయన బాబు కి అభినందనలు తెలిపారు. స్వచ్చ భారత్ నివేదిక అమలు చేస్తే సత్ఫలితాలు వస్తాయని ధీమా ని వ్యక్తం చేసిన మోడీ మాటలతో సంతోషపడ్డ బాబు ” ప్రధాని కోరుకుంటున్న దేశ స్వచ్చత లక్ష్యం సాధించడం కష్టమైన పనే కానీ అసాధ్యం మాత్రం కాదు” అన్నారు. 

మీడియా తో మాట్లాడుతున్న సమయం లో ప్రత్యేక హోదా విషయం ప్రస్తావనకి వచ్చిన సమయం లో వై కా పా లాగా దొంగ దీక్షలు ఎవరూ చెయ్యలేరని, అందుకే వారి మీద ప్రజలకి నమ్మకమే లేదు అని ఎద్దేవా చేసారు. జగన్ ఇప్పటికైనా ఇలాంటి దొంగ దీక్షల ఆలోచన పక్కన పెట్టేసి పూర్తిగా జనంలోకి వచ్చి వారి సమస్యలు తెలుస్కోవడం, దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అనేది వేచి చూడ్డం లాంటివి చేస్తే ప్రజల్లో వారి పార్టీ కి కనీసఉనికి ఉంటుంది అని అన్నారు చంద్రబాబు.

 స్వచ్చ భారత్ విషయంలో నరేంద్ర మోడీ నుంచి అందుకున్నప్రశంసల పట్ల ఏపీ సర్కారు సంతోషంగా ఉంది. అమరావతి శంకుస్థాపన కి కొన్ని రోజుల ముందు నుంచే మోడీ తరఫున బాబు కి మంచి మార్కులు పడ్డం తో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మోడీ నేతృత్వంలో అమరావతి శంకుస్థాపన జరిగిన తరవాత అక్కడ మాట్లాడబోయే ప్రధాని తన ప్రసంగం లో పెట్టుబడులని ఆహ్వానిస్తారు అని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -