Monday, May 20, 2024
- Advertisement -

తెలంగాణా ముఖ్య‌మంత్రి బాబు అయితే… కేసీఆర్ సంగ‌తేంటి..?

- Advertisement -

ఏపీ ఐటీ మంత్రి లోకేష్‌గా రాజ‌కీయ అజ్ణానం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. చంద్ర‌బాబుని ఏకంగా రెండురాష్ట్రాల సీఎంను చేశారు పుత్ర‌ర‌త్నం. గ‌తంలో జ‌యంతిని వ‌ర్థంత‌నిచేసిన ఘ‌న‌త లోకేష్‌గార‌ది. గ‌తంలో ప్రధాని పదవిని వదులుకున్నాడు బాబు అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇంకోసారి ఏమో అమెరికా లో కూడా టీడీపీ అధికారం లోకి వ‌స్తుంద‌ని మ‌హా గొప్ప‌గా సెల‌విచ్చారు. అది మ‌న ఐటీ మంత్రి లోకేష్‌గారి రాజ‌కీయ జ్ణానం. తాజాగా బాబును రెండు రాష్ట్రాల సీఎంని చేశారు.

ప్ర‌స్తుతం ఏపీ, తెలంగాణా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే. తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌దా బాబేంటి అదెలా సాధ్యం అనుకుంటున్నారా…? అక్క‌డికే వ‌స్తున్నా. సీఐఐ సదస్సు ఆహ్వాన పత్రిక సాక్షిగా ఇది నిజం.

విశాఖపట్నంలో జరుగుతున్న సదస్సులో నారా చద్రబాబు నాయుడ్ని రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిని చేసేశారు.ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చేసారు నిర్వాహకులు.ఎన్నో జాగ్రత్తలు తీసుకొని రూపొందించాల్సిన అధికారుల నిర్లక్ష్య‌మా లేకా మంత్రి లోకేష్ అజ్ణాన‌మా అన్న‌ది వారికే తెలియాలి.

 
CII Partnership Summit, Nara Lokesh, Chandrababu, Vizag
CII Partnership Summit at Vizag

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -