Sunday, May 5, 2024
- Advertisement -

అన్ని రోజులు ఒకేలా ఉండ‌వు….బాబును ఉతికి ఆరేస్తున్న జాతీయ మీడియా

- Advertisement -

జాతీయ మీడియాను…కోర్టుల‌ను మ్యానేజ్ చేయ‌డం ఎవ‌రికి అంత సుల‌భంకాదు. కాని విటిని మ్యానేజ్ చేయ‌డంలో ఏపీసీఎం చంద్ర‌బాబునుయుడికి వెన్నుతో పెట్టిన విద్యం. గత కొద్దికాలంగా మీడియాపై చంద్రబాబునాయుడి ప‌ట్టుత‌ప్పుతోంది.తాను ముఖ్యమంత్రిని అన్న సంగతి కూడా మరిచి దిగ‌జారుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ జాతీయంగా అబాసుపాల‌వుతున్నారు.
నిన్న‌టి వ‌ర‌కు బాబుకు అనుకూలంగా ఉన్న జాతీయ మీడియా ఇప్పుడు దుమ్ముదులుపుతోంది. కాకినాడలో చంద్రబాబు కాన్వాయ్‌ కోసం పేషెంట్ ఉన్న అంబులెన్స్‌ను అరగంట ఆపేస్తే జాతి మీడియా మాత్రం బాబు జోలపాటలో కళ్లు మూసుకుంది. అప్పుడు కూడా జాతీయస్థాయిలో జాతీయ మీడియా ఛానళ్లు ఈయనేం ముఖ్యమంత్రి అంటూ ఆడేసుకున్నాయి.
అయితే, కాలం ఎల్లకాలం ఒకేలాగుండదు కదా? ఇపుడు సీన్ రివర్స్ అయ్యింది. రాష్ట్రంలోని మీడియా అంటే సాక్షితప్ప ఇంకెవరూ చంద్రబాబు పాలనలోని డొల్లతనాన్ని, లోపాలను ఎత్తిచూపే పరిస్ధితి లేదు. పోనీ బహిరంగ సభల్లో సిఎం మాట్లాడుతున్న మాటలనైనా చూపుతున్నారా అంటే అదీ లేదు. అంతటి స్వామి భక్తి ప్రదర్శిస్తోంది చంద్రబాబు మీడియా.జాతీయ మీడియా మాత్రం విచిత్రంగా చంద్రబాబుపై విరుచుకుపడిపోతోంది. అవకాశం దొరికితే చాలు వాయించేస్తోంది.
తాజాగా నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా గోస్పాడు మండ‌లంలో త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుందామ‌ని వ‌చ్చిన ప్ర‌జ‌ల‌తో బాబు మాట్లాడిని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌ను న్యూస్ 18 జాతీయ చాన‌ల్ 9 నిమిషాల వీడియేను ప్ర‌సారం చేసింది.అదే ఇప్పుడుజాతీయస్ధాయిలో చంద్రబాబుకు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
సమస్యలు ప్రస్తావించిన వారిని ‘వీడే పార్టీ..వైఎస్ఆరా..జగన్మోహన్ రెడ్డి పంపారా, అరెస్టులు చేయిస్తా’ అంటూ విరుచుకుపడటాన్ని ప్రముఖంగా ప్రసారం చేసింది. ‘చంద్రబాబును ప్రశ్నిస్తే అరెస్టులే’ అన్న వ్యాఖ్యలతో వార్తను ప్రసారం చేసింది. ఆమధ్య ఇఫ్తార్ విందు సందర్భంగా రేషన్, పింఛన్, రోడ్లు తదితరాలపై జనాలను బెదిరంచటాన్ని కూడా ప్రస్తావించింది.
రాష్ట్రంలోని బాబు ఆస్థాన మీడియా కప్పిపెడుదామని ఎంత ప్రయత్నిస్తున్నా చంద్రబాబు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలన్నింటినీ జాతీయమీడియా మాత్రం ఉతికి ఆరేస్తోంది.అన్ని రోజులు ఒకేలా ఉండ‌వు అనేది బాబుకు ఇప్పుడు అర్థ‌మ‌వుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -