Saturday, May 18, 2024
- Advertisement -

ప్రచారంలో జయలలిత వెనుకంజ

- Advertisement -

తమిళనాడులో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఎన్నికలు సమీపించనుండడంతో అన్ని ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే అధికార అన్నాడిఎంకె మాత్రం ఇతర పార్టీలతో పోలిస్తే ప్రచారంలో వెనుకంజలోనే ఉంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు ఉచిత జపం చేస్తున్నాయి. ఈ సారి గెలుపు అన్నాడిఎంకెదే అని సర్వేలు చేబుతున్నా గత డిసెంబర్ లో వచ్చిన వరదల నుంచి జయ హవా తగ్గినట్లుగా కనిపిస్తోంది.

అయితే డిఎంకె మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. సర్వేలు బూటకమని, ఈసారి గెలుపు తమదేనని ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 1984 తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ రెండో సారి వరుసగా అధికారంలోకి రాలేదని ఆయన అంటున్నారు. ఇక జయలలిత తాను మళ్లీ అధికారంలోకి వస్తే మెడికల్ ఎంట్రన్స్ విధానాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు.

ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకువస్తామని ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చారు. 2006 లో ప్రభుత్వం మెడికల్ ఎంట్రన్స్ రద్దు చేసిందని, 2010లో మళ్లీ దీన్ని పునరుద్దరించారని, అప్పుడు అధికారంలో ఉన్న డిఎంకె దీన్ని పట్టించుకోలేదని జయలలిత చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -