Thursday, May 16, 2024
- Advertisement -

సహాయానికి సమయం వచ్చింది!

- Advertisement -

విభజన జరిగిన నాటి నుంచి.. రాష్ట్రానికి కేంద్రం ఏమైనా మేలు చేయకపోతుందా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఢిల్లీ చిన్నబోయేలా రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని ఎన్నికలో ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ కూడా జనానికి హామీ ఇచ్చారు. రీసెంట్ గా.. అమరావతి శంకుస్థాపన రోజు కూడా… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో ఉన్న హామీలన్నీ తీరుస్తామని లక్షలాది మంది సాక్షిగా చెప్పారు.

ఇప్పుడు ఇంకో ఫారిన్ టూర్ కూడా ముగించుకుని వచ్చారు. ఈ మధ్య బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన గుణపాఠంతో.. ఇప్పటికైనా దేశ ప్రజలను మళ్లీ తన వైపు చూసేలా చేయాలని ప్రధాని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.చాలా కాలంగా ఏపీని ఆదుకుంటామని.. రాష్ట్రానికి సహాయం చేస్తామని చెబుతూ వస్తున్న కేంద్రం ఇప్పటికైనా.. తన మాట నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. బీహార్ ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చి.. చివరికి ఉసూరుమన్న బీజేపీ.. ఇప్పుడు ఎంతో కాలంగా ఏపీ ప్రజలకు చెబుతున్న మాటను నిలబెట్టుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది.

ప్రధాని స్వయంగా నోరు విప్పి.. ఆంధ్రాకు చేసే సహాయంపై మామూలు జనానికి అర్థమయ్యేలా వివరించాలని అంతా కోరుకుంటున్నారు.ఇదంతా గమనిస్తున్న మోడీ అండ్ కో.. ప్రస్తుతానికి ఏపీకి అండగా ఉన్నామని చెప్పేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యూనివర్సిటీలు.. జాతీయ స్థాయి విద్యాసంస్థలు.. రాష్ట్రంలో ప్రారంభిస్తున్న కేంద్రం.. ఇకపై మరింతగా అండగా ఉన్నామని చెప్పేలా ప్లాన్ చేస్తోంది. అయితే.. భారీ సహాయంతో కాకుండా.. ఏటా కొంత ఆర్థికంగా అండగా ఉంటామని చెప్పేలా ప్రకటన ఉంటుందని సమాచారం.

త్వరలోనే.. ఓ భారీ బహిరంగ సభతో ఓ వైపు వెంకయ్యనాయుడు, మరోవైపు చంద్రబాబును పెట్టుకుని మరీ.. ప్రధాని ఏపీ ప్రజలకు ప్యాకేజీ ప్రకటిస్తారని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనుక నిజమైతే.. విమర్శకుల నోళ్లకు కొన్ని రోజులు తాళం పడే అవకాశం కూడా ఉంది. ఏపీ కేంద్రంగా దక్షిణ భారతదేశంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ… ఈ కార్యక్రమం నుంచే తన కార్యాచరణ ప్రారంభించే ఆలోచన చేసే చాన్స్ కూడా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -