Wednesday, May 22, 2024
- Advertisement -

కేంద్రం పట్టించుకుంటుందన్నవిశ్వాసం సన్నగిల్లింది .. ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్‌

- Advertisement -
Only 2 recommendations of T-govt accepted by GST Council saya Etela Rajender

కేంద్రం ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన జీఎస్‌టీ బిల్లుకైన్సిల్ స‌మావేశాల్లో రాష్ర్టాల ఘోష‌ అరణ్యరోదనే అయింది. సామాన్యులపై భారం మోపరాదన్న విజ్ఞప్తులు బుట్టదాఖలయ్యాయి. స్వయంగా ప్రభుత్వమే నిర్వహించే మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథలపై కూడా సర్వీస్ ట్యాక్స్ వసూలుకే కేంద్ర ఆర్థికమంత్రి నిర్ణయించారు.

దీనిపై తెలంగాణా ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.బీడీ, గ్రానైట్ పరిశ్రమ,ప్లాస్టిక్ కుర్చీలు, చేపల వలలు, వరిపొట్టు, తవుడు, నూకలు వేటినీ వదలని కేంద్రం, ఒక్క కళ్లజోళ్ల విషయంలో మాత్రమే కొంత వెసులుబాటు ఇచ్చింది.

{loadmodule mod_custom,GA1}

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేద ప్రజలకు సాగునీరు, రక్షిత త్రాగునీటిని సరఫరా చేసే పథకాలని…వీటిపై జీఎస్‌టీ త‌గ్గించ‌ల‌ని సీఎం కేసీఆర్ రాసిన లేఖ‌ను కూడా ప‌ట్టించుకోలేద‌న్నారు.6.3% పన్ను ఉండే గ్రానైట్ పరిశ్రమను జీఎస్టీ విధానంలో 28% శ్లాబ్‌లోకి చేర్చారని, ఇది లక్షలాది మంది కార్మికుల జీవనోపాధితో ముడిపడి ఉన్న అంశం కాబట్టి, 12% లేదా 18% పరిధిలోకి తేవాలని కేసీఆర్ కోరారని ఈటల చెప్పారు.
మత్స్యకారుల వలలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడే ఇన్సులిన్, ప్రాంతీయ సినిమాల గురించి చర్చించామని తెలిపారు. ఒక్క ఇన్సులిన్ విషయంలో మాత్రం 12% పన్నును 5%కి తగ్గించారని, ప్రాంతీయ సినిమాల విషయంలో రూ. 100 కంటే తక్కువ టికెట్ ధర ఉంటే పన్నును 18%కి తగ్గించినా ఆపై ధరలకు మాత్రం యధావిధిగా 28%గా ఉంచారని పేర్కొన్నారు.

{loadmodule mod_custom,GA2}

తెలంగాణ తరఫున మొత్తం 34 అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను పుస్తకరూపంలో సమర్పించామని తెలిపారు.జీఎస్టీ విధానంలో ఏ వస్తువును ఏ పన్ను శ్లాబ్‌లోకి తీసుకెళ్ళాలనేదానిపై రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయం లేదని అన్నారు.జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతూనే ఉంటాయని, ఇది నిరంతర ప్రక్రియ అని, చివరి సమావేశం అనే అంశానికి తావే లేదని అన్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}ISs6a-cQ7NA{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -