ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టీడీపీ నేతల కామెంట్లు విశ్లేషిస్తుంటే.. ఇది నిజమే అనిపిస్తోంది. వైసీపీ నుంచి వరుసగా ఎమ్మెల్యేలను లాగేసుకుంటున్న టీడీపీ నాయకత్వం.. రానున్న రోజుల్లో.. అన్ని కుదిరితే ఈ బడ్జెట్ సెషన్ నాటికే.. వైసీపీ అధినేత జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా పోగొట్టేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆపరేషన్ ఆకర్ష్ తో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు వల వేస్తున్న టీడీపీ.. త్వరలో మరింత మంది ఎమ్మెల్యేలకు పచ్చ కండువాలు కప్పే ప్రయత్నాల్లో ఉంది.
టీడీపీ నాయకుల భూ దందా పేరుతో.. సాక్షిలో వరుస కథనాలు వస్తుండడాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ.. తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్టే కనిపిస్తోంది. ఈ విషయాన్ని కాస్త ఇన్ డైరెక్ట్ గా స్పష్టం చేశారు… మంత్రి పల్లె రఘునాథరెడ్డి. అనంతపురంలో ఆయన చేసిన కామెంట్లు గమనిస్తే.. ముందు ముందు వైసీపీ మరింత బలహీనపడడం ఖాయమని తేలుతోంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాను కూడా కోల్పోవడం దగ్గర్లోనే ఉందని ఆయన కామెంట్ చేయడం వెనక ఉద్దేశం.. కనీసం మరో పది పదిహేను మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరే అవకాశాలు ఉన్నట్టే అని స్పష్టం చేస్తోంది.
తాజా పరిణామాలతో.. జగన్ కూడా అలర్ట్ అయినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా.. వీలైన అన్ని ప్రయత్నాలను జగన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ.. అధికార పార్టీ కావడం.. బెదిరించో, బతిమాలో, మంచి ఆఫర్ ఇచ్చో.. పక్క పార్టీల ఎమ్మెల్యేలను టీడీపీ తమ పార్టీలోకి చేర్చుకోవడం చూస్తుంటే.. వలసల ప్రవాహం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపిండం లేదు.
