Tuesday, May 14, 2024
- Advertisement -

భూసేకరణ చేస్తే ధర్నాకి దిగుతా..

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్నారు. రైతులతో సమావేశం అయిన తర్వాత భూ సమీకరపై పవన్ ఇలా స్పందించారు. 

లైవ్ అప్‌ డేట్స్ :

భూసేకరణ చేస్తే నేను ధర్నా కి దిగుతాను..

మీకు అండగా ఉంటాను పారిపోను.. 

అభివృద్దికి ఆటంకం కలిగించేవాడిని ఐతే టిడిపికి ఎందుకు మద్దతు ఇస్తాను.. 

రింగ్ రోడ్డులో భుమిని కోల్పోయినప్పుడు మురళీ మోహన్ ఎందుకు సుప్రీం కోర్టుకు వెళ్ళారు..?

ప్రజల కోసమే తండ్రిలాంటి అన్నయ్యను వదిలేసి మీకోసం వచ్చాను..

తోటి రైతుగా మీ దగ్గరికి వచ్చాను.. 

మీరేం చేసినా చూడటానికి నేనేం మీ భానిసను కాదు అని టిడిపి పై ఫైర్ అయ్యారు. 

రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతం కావాలి..

రైతుల కన్నీరుతో కట్టే రాజధాని మంచిది కాదు..

దయచేసి భూ సేకరణ చేయొద్దు..

దయచేసి నాకు కులాన్ని అంటగొట్టొద్దు..

టిడిపి తో గొడవ పెట్టుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు..

పవన్ కల్యాణ్‌పై రాయి విసిరిన ఆగంతకుడు..!

పవన్ చెప్పినట్లుగానే రాజధాని భూముల రైతులను కలవడానికి గుంటూరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన పవన్‌కు రైతులు తమ గోడు  చెప్పుకున్నారు.

మీరు చెబితేనే టిడిపికి ఓటు వేశామని కాని ఇప్పుడు ఈ ప్రభుత్వం మమ్మల్ని వేదిస్తోందని  రైతులు వాపోయారు. మా భూములు మూడు పంటలు పండుతాయి. అలాంటి భూములు రాజధాని కోసం ప్రభుత్వం ఎలా ఇవ్వమని అడుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రైతుల నుంచి సమస్యలు వింటున్న పవన్‌కి ఒక చేదు అనుభవం ఎదురైంది.

ఎవరో ఆగంతకుడు పవన్‌పై రాయి విసిరాడు. పవన్‌కు తగల్లేదు కానీ తనకు దగ్గరగా వచ్చి పడింది. కింద పడిన రాయిని పవన్ చేతిలోకి తీసుకొని పరిశీలన చేస్తూ ప్రజలు చెపుతున్న సమస్యలు వింటూనే మీకు నేను అండగా ఉంటాను. ఎక్కడికి పారిపోను అని రైతులకు ధైర్యం చెప్పారట.  ఆ తర్వాత పోలీసులు వచ్చి పవన్‌కు సెక్యూరిటిని అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -