Wednesday, May 15, 2024
- Advertisement -

ఈ ఏడాదంతా వర్షాలే.. వర్షాలు

- Advertisement -

మానవ జాతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ ఎండలు ఇక ఎంతో కాలం ఉండవు. ఈ ఉక్కబోత… వేడి.. నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇక ఎన్నాళ్ళో ఉండవు. ఈ ఏడాది వర్షాలు చాలా ఎక్కువగానే కురుస్తాయని అఖిల భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ఏడాది వర్షాకాలంలో ఏకంగా 106 శాతం వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం పేర్కోంది.

సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐఎండి డైరక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ తెలిపారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు ఒకేసారి విస్తరిస్తాయని, ఈశాన్య, ఆగ్నేయ ప్రాంతాలు, తమిళనాడుల్లో మాత్రం కాస్తంత తక్కువ వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు. నిరంతరం కరువు వేధించే మరట్వాడా ప్రాంతంలో కూడా ఈ సారి వర్షాలు భారీగానే ఉండడం విశేషం.

ఇక వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువవుతాయని, ఇది దేశానికి ఎంతో మేలు చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ ఆశాభావం వ్యక్తం చేస్ుతున్నారు. మరోవైపు ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింత ఎక్కువ పంటలు పండేలా చూసుకోవాలని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త కె.స్వామినాథన్ పిలుపునిచ్చారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -