Saturday, May 18, 2024
- Advertisement -

కరోనాతో కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌ సతావ్‌ కన్నుమూత!

- Advertisement -

మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్‌ సతావ్‌ (46) ఆదివారం కన్నుమూశారు. కరోనా, సైటోమెగలో వైరస్‌పై 23 రోజుల పాటు చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత ఆయన.. పుణెలోని ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. రాజీవ్‌కు ఏప్రిల్ 22న రాజీవ్‌కు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది.

ఆ మరసటి రోజే పుణెకు చెందిన జహంగీర్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ దాదాపు 20 రోజులు ఆయనకు చికిత్స అందించిన తర్వాత ఆయనకు కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. రాజీవ్‌ 1974లో సెప్టెంబర్‌ 21న పూణెలో జన్మించారు.

రాజీవ్‌ సతావ్‌.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి అత్యంత సన్నిహితుడు. రాజీవ్‌ సతావ్‌ మృతికి రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా ట్విట్టర్‌ ద్వారా నివాళులర్పించారు. కేంద్ర మాజీ మంత్రి జై రామేశ్‌ రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.

రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. కారణం అదేనా?

కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఇంకెప్పుడు కేసీఆర్ సారు? : షర్మిల

నేను మ‌ద్యం తాగ‌లేదు మెర్రో.. అవి మంచి నీళ్లు : సినీ న‌టి ధన్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -