Saturday, May 4, 2024
- Advertisement -

తెలంగాణలో కరోనా కలకలం.. 6 వేలకు చేరువలో కేసులు!

- Advertisement -

తెలంగాణలో కరోనా కలకల కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. వరుసగా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్క రోజే దాదాపు 6 వేల వరకు కొత్త కేసులు నమోదు కావడం ఆందోళనను పెంచుతోంది. నిన్న 1,22,143 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా… 5,926 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఇదే సమయంలో కరోనా కారణంగా 18 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 42వేలు దాటాయి. ప్రస్తుతం 42,853 యాక్టీవ్ కేసులున్నాయని చెప్పింది. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,61,359కి చేరాయి.

తాజాగా వైరస్‌ బారినపడి మొత్తం 1,856 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. . తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 793 జీహెచ్‌ఎంసీలోనే ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 87.62 శాతం, మరణాల రేటు 0.51శాతం ఉందని పేర్కొంది.

సాగర్ సభతో కరోనా కలకలం..నోముల భగత్‌కు కరోనా!

దేశంలో కోరలు చాస్తున్న కరోనా.. కొత్త‌గా 2.59 లక్ష‌ల మందికి వైరస్

ఏపి అన్నదాతలకు శుభవార్త.. నేడు రైతుల ఖాతాల్లోకి ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -