Tuesday, May 14, 2024
- Advertisement -

నేను గన్ను పట్టుకుంటా – అన్నా హజారే

- Advertisement -

ముంబయిలో విలేకరులతో మాట్లాడుతూ యూరీపై దాడిని తీవ్రంగా ఖండించిన హజారే… రెండు దేశాలు సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మరోవైపు పాకిస్థాన్ కళాకారులను దేశం విడిచివెళ్లాలని నవనిర్మాణ సేన హెచ్చరించడంపై ఆయన మాట్లాడుతూ…. యుద్ధం వేరు – కళలు వేరు.

కళలను ప్రత్యేకంగా చూడాలి… అవి మానవ జాతికి ఆనందం స్ఫూర్తి కలిగిస్తాయి. వాటిని తప్పుడు మార్గంలో ఉపయోగించడం  ఆమోదయోగ్యం కాదన్నారు.  కాగా పాకిస్థాన్ తో కనుక యుద్ధం తప్పనిసరైతే తాను కూడా అందులో పాల్గొంటానని ఈ 79 ఏళ్ల ఉద్యమకారుడు చెప్పడంపై అంతటా ఉత్సాహం నెలకొంది. మరోవైపు హజారే పనిలోపనిగా తన ఒకప్పటి మిత్రుడు… ఇప్పుడు ప్రత్యర్థి అయిన అరవింద్ కేజ్రీవాల్ – ఆయన పార్టీ ఆప్ పై విరుచుకుపడ్డారు.  

అరవింద్ కేజ్రీవాల్ కు అధికార దాహం ఏర్పడిందని కేజ్రీవాల్ కేబినెట్ లోని మంత్రులను వరుసబెట్టి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ పనితీరుకు తాను దు:ఖిస్తున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ దేశానికి మేలు చేస్తుందనుకోవడం తన తప్పన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -