Thursday, May 16, 2024
- Advertisement -

కేటీఆర్ ని లెక్క చెయ్యని తెరాస ?

- Advertisement -

తెలంగాణా రాష్ట్ర అధికార పార్టీ తెరాస లో కొత్త కథ నడుస్తోంది, ఇప్పటికే తెరాస అధినేత కెసిఆర్ కొడుకు కే టీ ఆర్ – కూతురు కవిత – మేనల్లుడు హరీష్ రావుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అని మీడియా హల్చల్ చేస్తోంది. త్వరలో రాబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో కొత్త యాంగిల్ చూపిస్తున్నారు వీరంతా కలిసి.

ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక విషయంలో ఈ డిస్కషన్ సాగుతోంది. తెలంగాణా స్థానిక సంస్థల నగారా మోగిన సంగతి తెలిసిందే. తెరాస ఈ ఎన్నికల్లో మూడు దఫాలుగా అభ్యర్ధులని ప్రకటించేసింది. ఇందులో కెసిఆర్ కుమారుడి సన్నిహితుడు, ప్రధాన అనుచరుడు కి చిట్ట చివరి జాబితాలో చోటు దక్కడం వింతగా అనిపిస్తోంది

రంగా రెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా  ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శంభీపూర్ రాజు మంత్రి కేటీఆర్ కు ప్రధాన అనుచరుడు.  ఎన్నికల్లో ఓడినా కూడా కేటీఆర్ వెంటే ఉన్నాడు ఆయన. 

మళ్ళీ రంగారెడ్డి లో ఉన్న రెండ ఎమ్మెల్సీ స్థానాలలో ఒక స్థానం రాజు కి ఖాయం అంటున్నాయి తెరాస వర్గాలు.  కేటీఆర్ కు ప్రధాన అనుచరుడు అయిన రాజుకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కడానికే తుది జాబితా వరకు వెయిటింగ్ ఉందంటే పార్టీలో బాస్ను తప్ప మరెవరినీ ప్రసన్నం చేసుకున్నా పనులు కావేమోనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -