తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పిల్లలకు ఫ్రీ

2022 నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. జనవరి 1న చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు సంస్థ ఎండీ వీసీ. సజ్జనార్‌ ప్రకటించారు.

అయితే తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించే 12 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే ఈ అవకాశం ఉంది. అది కూడా జనవరి 1న మాత్రమే. రాష్ట్ర వాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఈ సదుపాయం కల్పిస్తున్నుట్టు సజ్జనార్‌ తెలిపారు. ఈ మేరకు«అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

కొంత కాలంగా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే మార్గాలపై కొత్తగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్‌ దృష్టి సారించారు.. ఇందులో భాగంగానే ప్రతిసారి పండగలకు టికెట్‌ రేట్లను పెంచే ఆర్టీసీ ఈసారి దసరాకుపెంచలేదు. ప్రయాణికులను ఆకర్షించేందుకే తాజాగా చిన్నారులకు టికెట్‌ లేకుండా ఒక రోజు అవకాశం కల్పించారు.

బాలకష్ణ నెక్ట్స్‌ మూవీలో విలన్ గా స్టార్ హీరో

హై అలర్ట్‌ .. థర్డ్‌ వేవ్‌ వచ్చేసింది

ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా పడనుందా..?