Wednesday, April 24, 2024
- Advertisement -

థర్డ్​వేవ్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

- Advertisement -

కరోనా సెకండ్​వేవ్​ దేశవ్యాప్తంగా ఎంతటి ఉత్పాతాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి వేవ్​తో పోల్చుకుంటే సెకండ్​ వేవ్​లో మరణాల సంఖ్య అధికంగా ఉంది. అంతేకాక పలు ఆస్పత్రుల్లో కనీసం బెడ్లు కూడా దొరకలేదు. ప్రస్తుతం మనదేశంలో సెకండ్​ వేవ్​ వ్యాప్తి తగ్గింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే థర్డ్​వేవ్​ ముప్పు పొంచిఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్​ లేదా అక్టోబర్​లో థర్డ్​వేవ్​ రావొచ్చని.. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని వారు సూచిస్తున్నారు. థర్డ్​వేవ్​ సమయంలో చిన్నపిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? తదితర విషయాలు తెలుసుకుందాం..

పిల్లల్లో ప్రభావం తక్కువే..!
కరోనా వైరస్​ ప్రభావం పెద్దలతో పోల్చిచూసినప్పుడు పిల్లల్లో చాలా తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే పిల్లల్లో కరోనా వచ్చి తగ్గాక ప్రభావం ఉండొచ్చని వారు హెచ్చరిస్తున్నారు. మల్టీ సిస్టం ఇన్​ఫ్లమేటరీ సిండ్రోమ్​ వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్​ ఇస్తున్నారు. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో ప్రజలు యథావిధిగా మళ్లీ విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీంతో వైరస్​ విజృంభించే చాన్స్​ ఉందని నిపుణులు అంటున్నారు. పెద్ద వాళ్లు వ్యాక్సిన్​ తీసుకున్నారు కాబట్టి.. పిల్లలమీద ప్రభావం చూపిస్తుందని వారు అంచనా వేస్తున్నారు.

పిల్లల్లో లక్షణాలు ఇవే..!
పెద్దల మాదిరిగానే పిల్లల్లోనే కరోనా లక్షణాలు ఒకే రకంగా ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా జ్వరం, దగ్గు, అలసట, ఊపిరిలో తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కుదిబ్బడ, గొంతులో మంట, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ ఊపిరి అందకపోవడం.. శ్వాసలో తీవ్ర ఇబ్బందులు ఎదురైతే కచ్చితంగా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు

ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపించవద్దు. ఇండోర్​ గేమ్స్​కు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే.. కచ్చితంగా మాస్క్​ ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాక భౌతిక దూరంగా పాటించేలా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని వారికి సూచించాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -