Thursday, April 18, 2024
- Advertisement -

డెమొక్రాట్లు హస్తగతంలో ఎగువ సభ..!

- Advertisement -

అమెరికా ఎగువ సభ-సెనేట్​ను డెమొక్రాట్లు హస్తగతం చేసుకున్నారు. నూతనంగా ఎన్నికైన ముగ్గురు డెమొక్రటిక్ సభ్యులు తాజాగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో 100 మంది సభ్యులు ఉండే సభలో మెజారిటీ 50-50కి చేరింది. అయితే సెనేట్​కు నేతృత్వం వహించే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. డెమొక్రాటిక్ పార్టీకి చెందినవారు కావడం వల్ల.. వీరికి ఆధిక్యం లభించినట్లైంది. ఏదైనా అంశంపై ఓటింగ్​లో ఓట్లు సమానంగా చీలిపోతే.. సెనేట్ సభాధ్యక్షుడు టై బ్రేకర్ ఓటు వేస్తారు.

అమెరికా ఉభయసభలతో పాటు, వైట్ హౌస్ డెమొక్రాట్లు చేజిక్కించుకోవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి. ఇప్పటికే ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు సంపూర్ణ మెజారిటీ ఉంది.

కొత్తగా సెనేట్​లో అడుగుపెట్టినవారిలో జాన్ ఓసోఫ్, రాఫెల్ వార్నాక్, అలెక్స్ పాడిలా ఉన్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన ఓసోఫ్.. జార్జియా నుంచి గెలుపొందారు. అట్లాంటాలోని చర్చిలో పాస్టర్​గా పనిచేసే వార్నాక్ సైతం ఈ రాష్ట్రం నుంచే ఎన్నికయ్యారు. మరోవైపు, సెనేటర్​గా కమలా హారిస్ రాజీనామాతో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఏర్పడిన స్థానానికి పాడిలా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కమల వైదొలిగిన అనంతరం మిగిలిన కాలం పాటు సెనేటర్​గా కొనసాగుతారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -