Thursday, May 16, 2024
- Advertisement -

అమెరికా ఎన్నికలు .. ఎవరు గెలిస్తే ఏం జరుగుతుంది ?

- Advertisement -
US Presidential Election and the Impact on Markets

ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షా పదవి లో జరుగుతున్నా పోలింగ్ ఇప్పుడు కీలకంగా మారింది. అమెరికన్ చట్టాల ప్రకారం జరగబోతున్న ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగాబోతోంది. నెలల తరబడి నడిచిన ఎన్నికల పట్టం ఇవాళ ఆఖరి రోజుగా మారింది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అధ్యక్ష పదవిని సొంతం చేసుకుంటారని పలు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు.. అలాంటిదేమీ లేదని.. రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం పక్కా అని కొందరు విశ్వాసం చేస్తున్నారు.

విజేత ఎవరు అనేది తరవాత చూద్దాం కానీ ఎవరు గెలిస్తే ఏం జరుగుతుంది అనే రకరకాల ఎనాలసిస్ లు నడుస్తునాయి ప్రస్తుతం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఏం జరుగుతున్నదన్న విషయానికి వస్తే.. అమెరికా అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టనున్నారన్న విషయం తెర మీదకు వచ్చినంతనే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు అంతోఇంతో ప్రభావితం కావటం ఖాయం. ఒకవేళ ట్రంప్ కానీ విజయం సాధిస్తే.. ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురి అయ్యే ప్రమాదం ఉంది.

కాకుంటే.. రష్యా.. చైనాలు ఇందుకు మినహాయింపుగా ఉండే అవకాశం ఉంది. అయితే.. ఈ ప్రభావం తాత్కాలికం మాత్రమేనన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. హిల్లరీ విజేతగా ఆవిర్భవించిన వెంటనే.. ఇప్పటివరకూ నష్టాలు చవిచూస్తున్న మార్కెట్లు రికవరీ మోడ్ లోకి వెళ్లే వీలుంది. అదే సమయంలో ట్రంప్ గెలిస్తే మాత్రం మార్కెట్ తీవ్ర ఒడుదుడుకులకు లోను అయ్యే ప్రమాదం ఉంది. మన దేశం విషయానికి వస్తే.. అమెరికా అధ్యక్ష ఫలితాల ప్రభావం వెనువెంటనే పడినా.. అది తాత్కాలికమే తప్ప.. దీర్ఘకాలం మాత్రం కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఫలితాలు వెల్లడైన వెంటనే. ట్రంప్ గెలిస్తే మార్కెట్ నష్టాలు నమోదు చేసే ప్రమాదం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -