Saturday, May 18, 2024
- Advertisement -

ప్ర‌పంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్న భార‌తీయ రైల్వే

- Advertisement -
World’s tallest arch bridge is under construction in Jammu and kashmir

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచంలో అత్యంత ఎత్తైన ఈఫిల్ ట‌వ‌ర్‌నే చూశాం..కాని దాన్ని త‌ల‌ద‌న్నే రీతిలో.. .ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను భార‌తీయ రైల్వే నిర్మ‌స్తోంది. ఇది ఎక్డో కాదు మ‌న జ‌మ్మూ &కాశ్మీర్‌లో.ఇది పూర్త‌యితే అందాల జమ్ముకశ్మీర్‌ సిగలో మరో కలికితురాయి చేరనుంది.

కశ్మీర్‌ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో రైల్వే కనెక్టివిటీ కల్పించేందుకు ఉదంపూర్‌ – శ్రీనగర్‌–బారాముల్లా మార్గాన్ని వేస్తున్నారు. ఈ మార్గమధ్యంలోనే చీనాబ్‌ నదిపై రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. మ‌రో రెండేల్ల‌లో ఇది అందుబాటులోకి వ‌స్తుది.

చీనాబ్ న‌దీ మ‌ట్టానికి 359 మీటర్ల ఎత్తులో రెండు కొండ‌ల మ‌ధ్యన ఉండే ఈ వంతెన పొడవు 1.315 కిలోమీటర్లు. ఉగ్రవాదుల ముప్పు, మంచు వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా తాజా వంతెనను పకడ్బందీగా నిర్మించేందుకు రైల్వే సిద్ధమవుతోంది. కత్రా, బనిహాల్‌ల మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ వంతెన కీలక అనుసంధానంగా పనిచేయనుంది. 275 మీటర్ల ఎత్తులో ఉన్న షుయ్‌బాయ్‌ రైల్వే బ్రిడ్జి (చైనా)ని రెండో స్థానానికి నెడుతుంది మన చీనాబ్‌ బ్రిడ్జి.

{loadmodule mod_custom,Side Ad 1}

పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ ఎత్తు 324 మీటర్లు. అంటే ఈ బ్రిడ్జి ఈఫిల్‌ టవర్‌ కంటే మరో 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.ఈవంతెన ప్ర‌త్యేక‌త‌లు చెప్పాల్సిన ప‌నిలేదు.ఈ భారీ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.1,100 కోట్లు. ఇందుకోసం 24 వేలకు పైగా టన్నుల ఉక్కును ఉపయోగించనున్నారు. ఈ ఉక్కు మందం 63 మిల్లీమీటర్లు. పేలుళ్లను సైతం అది తట్టుకోగలదు. మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌ల చల్లటి వాతావరణాన్ని, గంటకు 250 కిలోమీటర్లకు పైగా వేగంతో వీచే గాలులను నిరోధించేలా ఈ వంతెన ఉంటుంది.

తనిఖీ నిమిత్తం రోప్‌ వే ఉంటుంది. రైల్వే లైన్‌తో పాటు పాదచారులు నడిచి వెళ్లేందుకు దారి, సైకిళ్లు వెళ్లడానికి మరోదారి ఉంటుంది.గంటకు 90కి.మీ. కంటే వేగంగా గాలులు వీస్తున్నట్లయితే సెన్సర్ల ద్వారా బ్రిడ్జికి ఇరువైపులా రెడ్‌సిగ్నల్‌ పడిపోతుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా బ్రిడ్జి పైనుంచి రైళ్ల రాకపోకలను అనుమతించరు. గాలివేగం తగ్గాక మళ్లీ ప్రయాణం మొదలవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు చైనాలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఉండేది దాన్ని త‌ల ద‌న్నే రీతిలో భార‌తీయ రైల్వే నిర్మంచ‌నుంది.ఇది దేశాన‌కి గ‌ర్వ‌కార‌నంతోపాటు ఇంజినీరింగ్ టెక్నాల‌జీలో ఏదేశానికి భార‌త్ తీసిపోదు.

Related

  1. పాకిస్థాన్ చేతిలో చంప‌బ‌డిన అమ‌ర‌జ‌వాన్ కుటుంబాల డిమాండ్‌..
  2. యుద్ధం చేయ‌డానికి సిద్ధం …క‌య్యానికి కాలు దువ్వుతున్న ఉత్త‌ర కొరియా ..
  3. విమానాశ్ర‌యాలో.. శృంగారంలో పాల్గొంటున్నారు.. దిమ్మ‌తిరిగే నిజాలు
  4. ఆర్మీ జరిపిన కాలుపులో పాకిస్థాన్ కు చెందిన రెండు బంకర్లు ద్వంసం.. ఏడు సైనికులు మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -