- Advertisement -

తెలుగు దేశం పార్టీ పగటి కళలు

- Advertisement -

తెలుగుదేశం ఎప్పుడూ రెండు రకాలుగా తమ కార్యక్రమాలు చేపడుతుంది. ఒకటి తమ పార్టీ సాధించిన ఘనత నీ తమ నాయకుడు చంద్రబాబు పోరాట పటిమా, కష్టపడే తత్వం గురించి ఊదర గొట్టడం. రెండవది జగన్ మోహన్ రెడ్డి ని తూర్పారబట్టడం. జగన్ చేసిన పనుల వలనే రాష్ట్రం ఇలా ఉంది అంటూ అప్పట్లో కాంగ్రెస్ ఏలిన రోజుల గురించి ప్రస్తావించడం. 

జగన్ పెంచి పోస్తిస్తున్న అరాచక శక్తుల వలనే రాష్ట్రం ఇలా ఉంది అంటూ ఉంటారు వారు. అయితే, ప్రతిపక్ష పార్టీపై అధికార పక్ష నేతలు విమర్శలు చేయడం అనేది రొటీన్. కానీ, స్వపక్షం సాధించిన విజయాల గురించి చెప్పుకునే సందర్భంలోనే స్వోత్కర్ష బయటపడిపోతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెగ అభివృద్ధి చెందిపోయిందని గతంలో చాలామంది దేశం నేతలు చెప్పుకొచ్చారు. రైతు రుణాలను వందశాతం అమలు చేసేశామని సాక్షాత్తూ  ఆ శాఖామాత్యులే చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో మాట్లాడుతున్నారు దేశం అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక. 

ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల కంటే ఏపీ కే ఇప్పటి వరకూ ఎక్కువ నిధులు వచ్చాయి అని ఆమె చెబుతున్నారు. ప్రత్యేక హోదా రాకపోయినా సరే అభివృద్ధి సాధిస్తున్నాం అనేది అం చెబుతున్న మెయిన్ పాయింట్. అయితే చంద్రబాబు వచ్చాక ఉద్యోగాలు వస్తున్నాయ్ అని ఆమె చెప్పడం వింతగా తోస్తోంది.

అమరావతి నిర్మాణం కూడా ఒక కొలిక్కి వచ్చింది అంటున్నారు ఆమె. ఏపీ లో ఇంత అభివృద్ధి నిజంగా ఉందా అని ఆమె చేబుతున్న విషయాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. అయితే క్షేత్ర స్థాయి లో ఎక్కడా ఉద్యోగాలు లేవని, అమరావతి కి నిధులు లేవు అనీ అర్ధం అవుతోంది. ఇది జనానికి కొదొఆ తెలుసు. కానీ కనపడుతున్న దాన్ని కూడా అబద్ధాలు గా చెబితే ఎలా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -