- Advertisement -
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలకు నిరసనగా వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపుతో ఆంధ్రప్రదేలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు ఆందోళనలు కొనసాగాయి.అబద్దపు హామీలతో రైతులను మోసగించిన చంద్రబాబును వైఖరిని ఈ ధర్నాల ధ్వారా నిలదీసారు.
ఇప్పటికీ రైతుల రుణాలు రెన్యువల్ కాకపోవడం, హుదూద్ తుఫాన్‌తో నష్టపోయిన పంటలకు పంట బీమా కూడా వర్తించక పోవడాన్ని తప్పబడుతూ అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో ఆందోళనలు చేపట్టారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలకు నిరసనగా వచ్చే నెల 5న కలెక్టరేట్ల ఎదుట దీక్షలు చేపట్టనున్నట్లు ఆపార్టీ అధ్యక్షుడు జగన్ పిలుపునిచ్చిన సంగరి తెలిసిందే!
