Saturday, May 18, 2024
- Advertisement -

నేడు వైఎస్సార్ చేయూత.. లబ్దిదారుల ఖాతాలోకి జమ!

- Advertisement -

ఏపి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తాను ఇచ్చిన హామీలు మాత్రమే కాదు పేద ప్రజలకు వివిధ పథకాల ద్వారా ఎన్నో లాభాలు చేకూర్చుతున్నారు. ఏపీలో ప్రభుత్వ పథకాలకు అర్హత ఉన్న అందని వారికి తిరిగి అందిస్తోంది జగన్ సర్కార్. రాష్ట్రంలో లబ్ధిదారులను ప్రభుత్వం మరోమారు ఎంపిక చేసింది.. వారికి డబ్బును అకౌంట్‌లో జమ చేస్తోంది.  దీనికి సంబంధించి మరోసారి అర్హతలను పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. 

అర్హత ఉన్న ఏ ఒక్కరూ కూడా లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే వైఎస్సార్‌ చేయూత కింద మిగిలిపోయిన అర్హులైన వారికి గురువారం ఆర్థిక సాయం అందించనున్నారు. రెండో పర్యాయం 45 నుంచి 60 ఏళ్లలోపు 2,72,005 మంది మహిళలకు రూ.18,750 చొప్పున రూ.510.01 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.

ఆగస్టు 12న వైఎస్సార్‌ చేయూత కింద 21,00,189 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళల ఖాతాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నగదు బదిలీ చేసిన విషయం తెలిసిందే. నేడు దరఖాస్తు చేసుకున్న అర్హులైన 2,72,005 మంది మహిళల ఖాతాలకు నేడు రూ.510.01 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయనుంది.

తప్పు చేస్తే పోలీసులను వదలం : సీఎం జగన్

విద్యార్థులకు జగన్ సర్కార్ భారీ ఊరట

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

వైఎస్సార్ ని మించి పోయిన జగన్.. పాలన భేష్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -