వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

- Advertisement -

ప్రజారోగ్యాన్ని అందించాల్సిన ఆరోగ్య విభాగానికి అవినీతి జబ్బు చేసింది. కొందరు అధికారుల భాగోతాలు “అవినీతి రహిత పాలన ” అంటున్న ముఖ్యమంత్రి కి తలవంపులు తెస్తున్నాయి. కోట్ల మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న ” కరోన “. APMSIDC లోని ఒక ఉన్నతాధికారికి మాత్రం కోట్లు కురిపించే కల్పతరువుగా మారింది. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ లో జరిగిన నియామకాలు , ట్రాన్స్ ఫర్లు , ప్రమోషన్లు అవినీతి , అక్రమాలను పరాకాష్టకు తీసుకెల్లాయి. వీటిపై ప్రజాప్రతినిధుల నుంచి , అధికారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో చిర్రెత్తిన ముఖ్యమంత్రి విజిలెన్స్ విచారణకి ఆదేశించినట్లు తెలుస్తోంది.

DME ఉన్నతాధికారి చేతివాటం, వ్యవహారశైలి పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది బాధిత వైద్యులు తమకు జరిగిన అన్యాయాన్ని విజిలెన్స్ విచారణ అధికారులకు విన్నవించుకుంటున్నారు. ఇటీవల భారీ ఎత్తున జరిగిన నియామకాలలో , ట్రాన్ ఫర్లలో , ప్రోమోషన్లలో , DME కోట్లు పోగేసుకున్నట్లు విచారణలో బయట పడుతున్నట్లు తెలుస్తోంది .

 • వేకెన్సీలు ( ఖాళీలు ) ఉన్నా కన్సెలింగ్ లో చూపక పోవడం, వాటిని తరువాత డబ్బిచ్చిన వారికి కట్టబెట్టడం జరిగాయి.
 • అర్హత లేని వారికి ప్రోమోషన్లలు ఇవ్వడం, అర్హతలున్న వారికి మొండిచెయ్యి చూపడం.
 • Biochemistry లాంటి డిపార్ట్మెంట్ లలో అర్హులైన వైద్యులను పక్కన బెట్టి , Msc లాంటి డిగ్రీ చేసిన వారిని , 10 లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వడం.
 • అవినీతి అక్రమాల కేసులను లంచాలు తీసుకొని మాఫీ చేయడం.
 • కర్నూల్ మెడికల్ కాలేజీలో ఒక ప్రొపెసర్ కొద్ది సంవత్సరాలుగా ఒక్క రోజు కూడ విధులకు హాజరు కాలేదు. ఆధారాలు , కర్నూల్ కాలేజి అధికారుల నివేదికలు దీన్ని ధృవీకరించినా , DME ఆయనకు మొత్తం జీతాన్ని sanction చెయ్యడం బరితెగింపుకు పరాకాష్ట.
 • DME ఆఫీస్ లో చిన్న ఫైల్ కదలాలన్నా చెయ్యి తడపాల్సిందే.
 • బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని మరీ రాష్ట్రవ్యాప్తంగా కలెక్షన్లు చేసుకోవడం చూసి ఉన్నతాధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు .
 • అసలు గుర్తింపే లేని ” ప్రభుత్వ వైద్యుల సంఘానికి ” కన్వీనర్ అవతారమెత్తిన ఒక దళారి వైద్యుడు ఈ బ్రోకర్ పనులలో సిద్ధహస్థుడుగా పేరు గాంచడం చర్చనీయాంశం .
 • మరో వైపు DME వ్యవహారశైలి సదరు మంత్రిగారికి సైతం తీవ్ర ఆగ్రహం కలిగించినట్టు తెలుస్తోంది .
 • డబ్బిస్తే తప్ప మంత్రి చెప్పినా పనులు కాక పోవడం విస్మయానికి గురిచేస్తోంది.
 • DME అవినీతి , అక్రమాలు , తలబిరుసుతనం, నిర్లక్ష్య వైఖరి చివరకు విజిలెన్స్ విచారణకు దారి తీశాయి.
 • విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి కి ఈ అవినీతి భాగోతాలు అసహనాన్ని కలిగిస్తున్నాయి.
- Advertisement -

చరిత్రలో ఎవ్వరూ చేయనన్ని వైద్య నియామకాలు చేపట్టిన ముఖ్యమంత్రి కి ఈ అవకతవకలు అక్రమాల వల్ల అభాసుపాలు కావడం ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. అందుకే విచారణాధికారులకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణాధికారులు కూడా రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగి ఉన్నా నిర్భయంగా వచ్చి పిర్యాదు చెయ్యాలని , వివరాలు గోప్యంగా ఉంచుతామని పిలుపినివ్వడంతో డొంక కదులుతోంది .

విచారణ విషయం రాష్ట్రవ్యాప్తంగా తెలిసిపోవడంతో , మరెందరో బాధితులు పిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఈ విచారణ అయినా వ్యవస్థను గాడిలో పెడుతుందో లేక తూ తూ మంత్రంగా మారుతుందో వేచి చూడాల్సిందే.

ప్రజలకు మాటిచ్చిన జగన్.. అస్సలు మాట తప్పడట..!

వైఎస్సార్ ని మించి పోయిన జగన్.. పాలన భేష్..?

విడ్డూరం..జగన్ ను పొగుడుతున్న టీడీపీ ఎమెల్యే..

స్థానిక బలాన్ని నమ్ముకుంటున్న జగన్..

Most Popular

అందుకే రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను : రాశి

బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన నటి రాశి. పరిచయమైన మొదటి సంవత్సరంలోనే 10 సినిమాలు చేసిన రాశి ఎక్కువ కాలం తన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది. దాదాపు సినీయర్ హీరోలందరి సరసన ఆమె...

కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే..!

టాలీవుడ్ కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి సినిమాలో తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సాధించి నటి గా ఒక మెట్టు ఎక్కింది అని చెప్పుకోవచ్చు. అయితే వ‌రస...

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

కొంతకాలంగా సినిమాల్లో కమెడియన్ పాత్ర ప్రాధాన్యత పోసిసింది. సినిమాలో హీరో, హీరోయిన్ మరియి విలన్ ఎంత ముఖ్యమో అలాగే హాస్యనటుడు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినిమా బాగా పండలంటే కామెడి ఎంతో...

Related Articles

కరోనా పోరులో కొవిడ్​ యోధులు’గా పాత్రికేయులు..!

కరోనా కారణంగా మృతిచెందిన పాత్రికేయులను 'కొవిడ్​ యోధులు'గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెస్​ కౌన్సిల్​​ ఆఫ్​ ఇండియా(పీసీఐ) కోరింది. వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి అందించే ప్రయోజనాలనే జర్నలిస్టులకూ అందించాలని విజ్ఞప్తి చేసింది....

పాఠశాలలను తెరిచేందుకు అనుమతి కావాలి..!

కరోనా వైరస్‌ ప్రభావంతో దేశ వ్యాప్తంగా మూతపడిన పాఠశాలలను జనవరి 4 నుంచి తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని సీఐఎస్‌సీఈ (ద కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌) కోరింది. ఈ...

పంజాబ్ లో టీకా ఆయనకే ముందు..!

Vaccination in Punjab before him కొవిడ్​పై పోరులో ముందుండి పోరాడుతున్న వారికే మొదటి దశలో టీకా అందిస్తామని పంజాబ్​ ప్రభుత్వం ప్రకటించింది. టీకాను ఐసీఎంఆర్​ ఆమోదించిన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...