ఎపిలో కాంగ్రెస్ నేతల భధ్రత తగ్గింపు
మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కుదించింది. మొత్తం 39మంది గన్మెన్లను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
ఇకపై రైల్వే రిజర్వేషన్ కేంద్రాలు ప్రైవేటుపరం
రిజర్వేషన్ కేంద్రాలను ప్రైవేటీకరిస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి వైటీఎస్‌కే పేరిట ప్రైవేట్ రిజర్వేషన్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. సర్వీస్ చార్జ్ వసూలు చేసుకునే అవకాశాన్ని వైటీఎస్‌కేలకు అప్పగించింది.
వ్యవసాయ బడ్జెట్ ప్రజలను ఊరించడానికి చేస్తున్న మరో ప్రయత్నం
కేబినెట్ నిర్ణయాల్లో బేలతనం కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ డిప్యూటీ లీడర్ జ్యోతుల నెహ్రూ అభిప్రాయపడ్డారు. కేబినెట్ తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత లేదన్నారు.
‘సుప్రీం కోర్టుకు వెళ్లి పొరపాటు చేసింది’
ఎంసెట్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి పొరపాటు చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు.
’హరీష్ కెసిఆర్ కు లేఖ రాయాల్సింది’
మంత్రి హరీష్ రావు లేఖ రాయవలసింది చంద్రబాబుకు కాదని, ముఖ్యమంత్రి కెసిఆర్ కు అని రేవంత్ అన్నారు.
జూపూడి తర్వాత ఎవరు?
వైఎస్సాఆర్ సీపీకి మరో ఎదురు దెబ్బ తగలనుందా? తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వైసీపీలో మరో కీలకనేత అంబటిరాంబాబు పార్టీకి ఝలక్ ఇవ్వనున్నారా?
31 లోగా ఎమ్సెట్ కౌన్సిలింగ్ పూర్తి చేయాలి- సుప్రిం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్లు విభజన చట్టానికి లోబడే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 31 లోగా కౌన్సెలింగ్ పూర్తికావాలని, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభం కావాలని తెలిపింది.
ప్రకాశం జడ్పీ ఛైర్మన్పై అనర్హత వేటు
ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబు జడ్పీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అక్కడి జిల్లా కలెక్టర్ విజయకుమార్ నిర్ణయం తీసుకున్నారు. విప్ ధిక్కరించిన కేసులో ఆయనపై అనర్హత వేటు వేశారు.
‘హైదరాబాద్పై అధికారాన్ని వదిలం అంటున్న టి. ఛీప్ సెక్రటరీ
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు.
రిలయన్స్‌కు సెబీ రూ.13 కోట్ల జరిమానా
దేశీ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు నియంత్రణ సంస్థ సెబీ రూ.13 కోట్ల జరిమానా విధించింది. ఏడేళ్ల క్రితం నాటి స్టాక్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘన కేసులో శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కు జూపూడి గుడ్ బై!
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధికార ప్రతినిధి , శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
‘రాజధాని కోసం రాజధానుల అధ్యయనం’
రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రపంచంలోని ఆరు దేశాల రాజధానులతోపాటు దేశంలోని నాలుగు రాష్ట్రాల రాజధానులను అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు రాజధాని సలహా కమిటీ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి పి.నారాయణ వెల్లడించారు.
‘గవర్నర్ పెత్తనం’ అనేది చంద్రబాబు కుట్ర!
హైదరాబాద్ నగర బాధ్యతలను గవర్నర్ నరసింహన్ కు అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
కేసీఆర్తో పోటీకి సిద్ధం అంటున్న చంద్రబాబు
అభివృద్ధి విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో తాను పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు తెలిపారు.
తిరుమలలో మూగకి మాట వచ్చింది!
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి సన్నిధిలో శనివారం అద్భుతం జరిగింది. పుట్టు మూగకు మాటలు వచ్చాయి. లండన్కు చెందిన ఓ ఎన్నారై కుటుంబం ఈరోజు ఉదయం తన కుమారుడితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు.
ఒక రోజులో సర్వే సాధ్యమా ?
ఈ నెల 19 నుంచి తెలంగాణ ప్రభుత్వం జరప తలపెట్టిన సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే నిర్వహణ విమర్శలకు తావిస్తోంది. 625 చ.కి.మీ. మేర విస్తరించిన జీహెచ్‌ఎంసీలో దాదాపు 20 లక్షల ఇళ్లున్నట్లు అంచనా వేసిన అధికారులు సర్వే నిర్వహణకు దాదాపు లక్షమంది సిబ్బంది సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు మండిపడుతున్నారు.