పట్టాలెక్కిన హైదరాబాద్ మెట్రో.. ట్రయిల్ రన్ సక్సెస్
భాగ్యనగరం మరో అరుదైన ఘనతను సాధించింది. జంట నగరాలలో ట్రాఫిక్ రద్దీ సమస్యను తగ్గించేందుకు ప్రారంభించిన మెట్రో రైలు ప్రాజెక్ట్ ఓ మైలు రాయిని అధిగమించింది.
అమ్మాయి కోసం దేశద్రోహానికి పాల్పడాడు!
ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ అమ్మాయి ట్రాప్‌లో పడి.. ఓ సైనికాదికారి దేశద్రోహానికి పాల్పడిన సంఘటన యావత్ దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఇక వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్న ఓ మిలటరీ అధికారిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
కొత్త సినిమా సిటీకి కెసిఆర్ పేరు పెట్టాలి: కృష్ణ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఆంద్ర సినీ ప్రముఖుల నుంచి మంచి మద్దతు వస్తోంది. తెలంగాణలో రెండువేల ఎకరాలతో నిర్మించబోయే ఫిల్మ్ సిటీకి కేసీఆర్ పేరు పెడితే బాగుంటుందని సూపర్ స్టార్ కృష్ణ ప్రతిపాదించారు.
కొత్తపల్లి గీతపై అసభ్యప్రచారం.. నిందితుల అరెస్ట్
అరకు ఎంపీ కొత్తపల్లి గీతను ఉద్దేశిస్తూ ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్ట్ చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు.
బ్యాంకులు రుణమాఫీకి సానుకూలంగా లేవా?
ఏ బ్యాంకులూ రుణమాఫీకి సానుకూలంగా లేవని, పరపతి విధానం దెబ్బతింటున్న భావనతో బ్యాంకులు మాఫీని వ్యతిరేకిస్తున్నాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనడం బ్యాంకులు రుణమాఫీకి సానుకూలంగా లేవనే సంకేతాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ఉంది.
ఈ పసిడి చొక్కా ఖరీదు కోటి 30 లక్షలు !
ధరలు చుక్కలంటుతున్న ప్రస్తుత తరుణంలో చొక్కా కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం కాని మహారాష్ట్రకు చెందిన ఓవ్యక్తి ఏకంగా బంగారం పూతతో ఉన్న చొక్కాను ధరించి అందర్ని ఆకట్టుకున్నాడు. నాలుగు కిలోల బరువున్న ఆచొక్కా ధర అక్షరాల కోటి 30 లక్షల రూపాయలు.
”ఆగష్టు నెలాఖరులోగా ఇంజనీరింగ్ అడ్మిషన్లు పూర్తి”
నిర్ణీత తేదీ ప్రకారమే ఎమ్సెట్ కౌన్సిలింగ్ చేస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి చెప్పారు. అయితే తెలంగాణలో సర్టిఫికెట్ల పరిశీలనకు మరి కొద్ది గడువు కావాలని తెలంగాణ అధికారులు కోరారని, అందుకు ఇబ్బంది లేదని,రెండు ,మూడు రోజులు ఆలస్యంగా ప్రక్రియ మొదలవుతుందని అన్నారు.
అభివృద్దిలో పోటీపడే దమ్ముందా?- కెసిఆర్
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొ. జయశంకర్ విశ్వవిద్యాలయంగా నామకరణం చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రొ.జయశంకర్ జయంతి సందర్బంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.
పాత్ర కోసం ఎంత దూరమైనా..
సినిమాను, పాత్రను బలంగా నమ్మిన నటుడు.. ఆ సినిమా కోసం, పాత్ర కోసం ఎంత దూరమైనా వెళతాడన్న సత్యాన్ని అమీర్ ఖాన్ మళ్లీ ఋజువు చేశాడు.
విజయవాడలో సందడి చేసిన సచిన్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ శుక్రవారం విజయవాడ నగరంలో సందడి చేశారు.
హైదరాబాద్‌లో ఇక అంతర్జాతీయ స్థాయి పోలీస్ వ్యవస్థ
హైదరాబాద్‌లో ఇక అంతర్జాతీయ స్థాయి పోలీస్ వ్యవస్థ రూపుదిద్దుకోబోతుంది.
అంతా లోకేష్ ”అభీష్టం” మేరకే!
మంత్రుల పేషీల్లో నియామకాలన్నీ లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని సమచారం. అన్నీ చంద్రబాబు తనయుడు లోకేశ్ ‘అభీష్ట’ం మేరకే జరుగుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఆగస్ట్ 15న ఎన్టీఆర్ ‘రభస’
జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'రభస' ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నందమూరి అభిమానులు పండుగ చేసుకోనున్నారు.
నటుడు ముక్కురాజు కన్నుమూత
సీనియర్ నటుడు సాగిరాజు రాజంరాజు (ముక్కు రాజు) గురువారం ఉదయం మరణించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెయ్యికి పైగా సినిమాల్లో ఆయన నటించారు.
సుష్మాస్వరాజ్కు వైఎస్ జగన్ లేఖ
లిబియాలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించాలని కోరుతూ విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి లేఖ రాశారు. లిబియాలో చిక్కుకుపోయిన తెలుగువారిపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
చెన్నై రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు
తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రధాన రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఓ రైలును బాంబులతో పేల్చేస్తామని ఆగంతకులు ఫోన్ చేయడంతో కలకలం రేగింది. పోలీసులు రంగంలోకి విస్తృత తనిఖీలు చేపట్టారు.