Saturday, May 4, 2024
- Advertisement -

కోట్ల‌కు షాక్ ఇస్తున్న అనుచ‌రులు…అంతు ప‌ట్ట‌ని కేఈ అంత‌రంగం..

- Advertisement -

కర్నూల్ జిల్లా టీడీపీ రాజకీయాలు మరింత వేడేక్కుతున్నాయి. టీడీపీలో కోట్ల చేరిక వార్త‌ల‌తో జిల్లా టీడీపీ రాజ‌యాల‌ను ఓకుదుపు కుదిపేస్తోంది. త‌న రాజ‌కీయ భ‌విస్య‌త్తుకోసం టీడీపీలో చేరాల‌నుకున్న కోట్ల‌కు ఎదురు ప‌వ‌నాలు వీస్తున్నాయి. కోట్ల నిర్ణ‌యంపై సొంత అనుచ‌రులు మండిప‌డుతున్నారు.

జిల్లా రాజ‌కీయాల‌పై ప‌ట్టు సాధించేందుకు శత్రువులంద‌రిని పార్టీలో చేర్చుకుంటున్నారు చంద్ర‌బాబు. టీడీపీలో చేరేందుకు బాబుతో స‌మావేశ మ‌య్యారు మాజీ మంత్రి కోట్ల‌. అమావాస్య వెళ్లిన తర్వాత అంటే ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత అధికారికంగా టీడీపీలో చేరనున్నారు. అయితే కోట్ల అనుచ‌రులు మాత్రం తీవ్ర అసం తృప్తిలో ఉన్నారు. దీంతో త‌మ దారి తాము చూసుకొనేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.

కోట్ల అనుచ‌రుల్లో ప్ర‌ధానంగా ఎక్క‌వ మంది వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌వుతుండ‌గా….మ‌రి కొంద‌రు రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాలి నిర్ణ‌యించుకున్నారు. మ‌రో వైపు ఆయ‌న రాక‌ను కేఈ వ‌ర్గం కూడా తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. మొద‌టినుంచి కోట్ల‌, కేఈ కుటుంబాల‌కు అధిప‌త్య పోరు ఉన్న సంగ‌తి తెలిసిందే. పుట్టినప్పటి నుంచి టీడీపీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి, కుటుంబాలను సైతం కోల్పోయి, జైలు జీవితం గడిపిన తాము ఇప్పుడు ఆ పార్టీలో ఎలా చేరుతామని నేరుగా కోట్లను ప్రశ్నిస్తున్నారు అనుచ‌రులు.

కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి త‌మ్ముడు కోట్ల హర్షవర్దన్‌రెడ్డి వెంట వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్దం అయ్యారు. ఆయ‌న బాట‌లోనే మ‌రికొంత మంది నేత‌లు న‌డ‌వ‌నున్నారు. మొద‌టే వైసీపీలో చేరాల‌ని అనుచ‌రులు అంద‌రూ కోట్ల‌ను కోరిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న కూడా వైసీపీలో చేర‌డం దాదాపు ఖ‌రార‌య్యింద‌నే వార్త‌లు వచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే చివ‌ర‌కు టీడీపీలో చేరేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

కోట్ల నిర్ణ‌యంతో ఆయ‌న అనుచ‌రులు అంద‌రూ టీడీపీతో కలిసి నడిచే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. ఇక డిప్యూటీ సీఎంకే సమాచారం లేకుండా చేరికలు జరగడంపై ఆయన వర్గీయులు మండిపడుతున్నారు. మొదటి నుంచీ వైరి వర్గంగా ఉన్న తాము ఆయన ఎంపీగా పోటీ చేసినా సహకరించే పరిస్థితి ఉండదని అంటున్నారు

ఇక డిప్యూటీ సీఎం కేఈ మాత్రం కోట్ల చేరిక‌పై ఆచితూచి స్పందించారు. ఆయ‌న మాట‌లు చూస్తే కోట్ల రాక‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరిక విషయాన్ని కేఈకి ముందుగానే సమాచారం ఇచ్చినట్టుగా టీడీపీ వర్గాల స‌మాచారం. అయితే ఆ వార్త‌ల‌ను ఖండించారు డిప్యూటీ సీఎం. కోట్ల కుటుంబం చేరిక‌పై త‌నతో బాబు చ‌ర్చించ‌లేద‌న్నారు. బాబు ఆడిగి న‌ప్పుడు త‌న అభిప్రాయం చెప్తాన‌ని కేఈ ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

శత్రువులుగా ఉన్న వారంద‌రినీ బాబు పార్టీలో చేర్చుకుంటున్నారు. గ‌తంలో కూడా భూమా కుటుంబం టీడీపీలో చేరిన‌ప్పుడు త‌న‌కు కేఈ ఈ విధంగానే స్పందించారు. కోట్ల ఫ్యామిలీ చేరిక విషయాన్ని బాబు కేఈ కృష్ణమూర్తికి సమాచారం ఇవ్వలేదా.. లేక కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకోవడంపై అసంతృప్తితో కేఈ ఇలా మాట్లాడుతున్నారా అనేది అంతుపట్టడం లేదని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. కోట్ల చేర‌క‌ను కేఈ వ్య‌తిరేకించినా చివ‌ర‌కు బాబు మాట విన‌డం త‌ప్ప చేసేదేముంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -