- Advertisement -

2014లో ఓటేసినందుకు కాదా? 2019లో ఓటేయకపోతే ప్రజలు సిగ్గుపడాలా బాబూ?

- Advertisement -

అత్యంత ఎక్కువ అనుభవమున్న రాజకీయ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు 2014 ఎన్నికల సమయం నుంచీ కూడా అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. జగన్ అంటే భయపడుతున్నాడో లేక తనపైన తనకే నమ్మకం సన్నగిల్లుతుందో కానీ అనుక్షణం రాజకీయాలు చేస్తూ అందరినీ తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఐఎఎస్‌లతో సహా అధికారులందరూ తనకంటే తక్కువే అని చంద్రబాబే స్వయంగా చాలా సార్లు చెప్పాడు. ఇక కేబినెట్ సహచరులను అయితే మరీ బానిసలను చేసుకున్నాడు. మీడియా కూడా పూర్తిగా తనను పొగడడానికే మాత్రమే పరిమితమవ్వాలనుకుంటున్నాడు. బాబు, లోకేష్‌లను ఎవ్వరూ విమర్శించకూడదు అన్న అనధికార చట్టాన్ని ఆంద్రప్రదేశ్‌లో బలంగా అమలు చేస్తున్నారు.

ఇక తాజాగా నూతన సంవత్సరం రోజునే తన నియంతృత్వ స్థాయిని కఠినంగా చూపించాడు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో అన్ని సీట్లూ చంద్రబాబుకే కట్టబెట్టాలట. అన్ని ఓట్లూ బాబు పార్టీకే పడాలట. ఎవరైనా చంద్రబాబుకు ఓటేయకపోతే వాళ్ళు సిగ్గుపడాలట. బాగుంది…. బాబుగారి థియరీ చాలా బాగుంది. మరి చంద్రబాబుకే ఎందుకు ఓటేయాలన్న ప్రశ్నకు చంద్రబాబు ఏం సమాధానం చెప్తాడు? 24గంటలూ కష్టపడుతున్నానని చెప్తాడు. స్నానపానాదులు కూడా మానేశానని, అన్నింటినీ త్యాగం చేశానని చెప్తాడు. ఇది ఇంకా బాగుంది. కాకపోతే కష్టపడుతున్నాను కాబట్టి నన్ను పాస్ చేయండి అని పరీక్షలో రాస్తే పాస్ అవుతారా? ఆ కష్టపడిన ఫలితం చూపించాలిగా? మరి ఆ ఫలితాన్ని చూపించగలరా బాబుగారు?

ప్రజల కంటికి కనిపిస్తున్నదంతా మాత్రం చంద్రబాబు చేసిన ద్రోహమే. ఆంద్రప్రదేశ్‌కి సంజీవని అని ఎన్నికల సమయంలో బాబే చెప్పిన ప్రత్యేక హోదా రాకుండా తానే అడ్డుపడడ్డం నుంచీ రైల్వేజోన్ రాకపోవడం, పోలవరంలో అవినీతి కోసం రాజకీయం, రుణమాఫీలు చెయ్యకుండా మోసం చెయ్యడం, నిరుద్యోగ భృతిపై ఇప్పటికీ తేల్చకపోవడం, రాజధానిలో ఒక్క శాశ్విత భవన నిర్మాణానికి కూడా కనీసం పునాదులకు కూడా దిక్కులేకపోవడం. ఇక రైతులు, సామాన్యుల కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఇన్ని వైఫల్యాల మధ్య కూడా ఒక విషయంలో మాత్రం బాబుగారు ఘన విజయం సాధించారు. మద్యం అమ్మకాల్లో మాత్రం పాత రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసి 2014 కి ముందు సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఏ స్థాయిలో ఆదాయం వచ్చింది…….ఇప్పుడు కేవలం సీమాంధ్ర నుంచే అంత ఆదాయం రాబట్టేలా చేయడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు బాబుగారు. బెల్ట్ షాపులు తీసేస్తా, మద్య నియంత్రణ చేస్తా అన్న బాబుగారు సాధించిన విజయం ఇది.

బాబు ప్రచార పటాటోపాన్ని పక్కన పెడితే, గ్రాఫిక్స్ బొమ్మలు కాకుండా, విదేశీ టూర్లు కాకుండా బాబుగారు మూడున్నరేళ్ళలో చేసిన అభివృద్ధి ఏదైనా కంటికి కనిపిస్తోందా? అలాంటి నేపథ్యంలో 2014లో చంద్రబాబుకు, చంద్రబాబు చెప్పాడని చెప్పి నరేంద్రమోడీకి ఓటేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుపడాలా? లేక 2019లో ఓటు వేయకుండా ఉంటే అందుకు సిగ్గుపడాలా? ఓటుకు కోట్లు లాంటి కేసులో దొరికిపోయి అడ్డంగా బుక్కయి ఆంద్రప్రదేశ్ పరువు తీసినందుకు 2019లో బాబుకు ఓట్లు వేయాలా? 2014లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నిజాయితీగా, సంపూర్తిగా అమలు చేయలేని చంద్రబాబుకు 2019లో కూడా ఆంద్రప్రదేశ్ ఓటర్లు ఓట్లు వేసే అవకాశం ఉందా? ఒకవేళ అదే జరిగితే భారతదేశం మొత్తం కూడా ఆంద్రప్రదేశ్ ఓటర్లను చూసి జాలిపడదా? అబద్ధాలు, కుట్ర పూరిత రాజకీయ వ్యూహాలతో కూడా విజయం సాధించొచ్చన్న పాఠాలు యువతకు నేర్పించినట్టు అవదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -