నీతులు ఇతరులకు చెప్పేందుకే ఉంటాయి గానీ…. మన దగ్గరకు వచ్చటాలకు మాత్రం అవేవి వర్తించవు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పరిస్థి. అ స్థాన మీడియా అండతో నేను ఏం చేసినా చెల్లుతుందనే అహంకారంతో పరిపాలన సాగిస్తున్నారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల గురించి బాబు నీతి మాటలు కోటలు దాటుతున్నాయి.
అసెంబ్లీనీ బహిష్కరించిన వైసీపీనేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాకుండా వైకాపా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారని.. బాబు చాలా ఆందోళన వ్యక్తంచేశాడు. అది బాగానే ఉందిగాని ఆ నీతులు మనకు వర్తించవా అంటే అ దొక్కటి అడక్కు అంటారు చంద్ర బాబు.
రాజకీయ నాయకుని ఇంటి మందు ముగ్గు ఉండదు..నాయకులకు సిగ్గు ఉండదనే సినిమా డైలాగ్ బాబు అతికి నట్లుగా సరిపోతుంది. రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి రాష్ట్రంలో ఫిరాయింపులకు తెరలేపారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన బాబు వైసీపీ నుండి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తెచ్చుకున్నారు. వారిలో 4 గురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. అ లాంటి నేత ఇప్పుడు నీతుల గురించి మాట్లాడం చూస్తే ఒంటి కాలిమీద కొంగ జపం చేస్తున్నట్లు ఉంది.
అంతమంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే.. ఫిరాయింపు చేసినందుకు అనర్హులు కావాల్సిన వాళ్లు.. అసెంబ్లీకి వచ్చి మంత్రులుగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా కూర్చుంటే చంద్రబాబుకు చీమైనా కుట్టినట్టుగా లేదు. పైగా రాజకీయ విలువల గురించి మాటలు మాత్రం కోటలు దాటుతాయి.
వైకాపా ఎమ్మెల్యేలు సభకు రాకుండా నిరసన వ్యక్తంచేస్తే మాత్రం ఎక్కడలేని అసహనం పుట్టుకొస్తోంది. ఫిరాయింపు చేసినందుకు అనర్హత ఎదుర్కొనాల్సిన వాళ్లు మంత్రులుగా చలామణి అయిపోతూ చట్టాలు చేస్తుంటే చంద్రబాబుకు సంతోషంగా ఉంది కానీ.. వైకాపా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నందుకు మాత్రం చచ్చేంత సిగ్గుగా ఉంది.
తను నిస్సిగ్గు రాజకీయాన్ని చేస్తూ.. అవతల వాళ్ల మీద బురద జల్లడం చంద్రబాబుకు తెలిసన ఏకైక రాజకీయ నీతి. తను తప్పు చేస్తూ అవతల వాళ్ల మీద విరుచుకుపడటం బాబు చేసే రొటీన్ పని. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఫిరాయింపు దారులను సమర్థిస్తూ.. తను ‘సంతలో పశువులు’గా కొనుగోలు చేసిన వారి గురించి మాట్లాడకుండా చంద్రబాబు వైకాపా ఎమ్మెల్యేలకు మాత్రం నీతులు చెబుతున్నాడు. ప్రజలు అంతా గమనిస్తున్నారన్న సంగతి బాబు తెలుసుకుంటే మంచిది.
