Sunday, May 19, 2024
- Advertisement -

భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా ద‌క్క‌దు

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ కొన్ని గంట‌ల్లో ప్రారంభం కానుండ‌టంతో అటు పార్టీల్లోను…ఇటు ప్ర‌జ‌ల్లోను తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఓట్ల‌లెక్కంపు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో వైసీపీ…టీడీపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. గెలుపు మాదంటె మాదేన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీ మంత్రి ఆదినార‌య‌ణ‌రెడ్డి ప్ర‌తిప‌క్ష‌పార్టీల‌పై తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిందిజ.

నంద్యాలో ఓటమి భయంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడుతోందని మంత్రి, టిడిపి నేత ఆదినారాయణ రెడ్డి శనివారం విమర్శించారు. రాష్ట్రంలో మరో 44 గంటల్లో వైసిపి క్లోజ్ కాబోతోందని హెచ్చరించారు. కొద్ది గంటల్లో నంద్యాల ఫలితాలు రానున్నాయని, టిడిపి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని చెప్పారు. నంద్యాలలో ఓటమితో వైసిపి పని ఖతం అయినట్లేనని, భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.

రోజా వచ్చిందంటే.. వైసిపి ఎమ్మెల్యే రోజా వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమైనట్లేనని ఆదినారాయణ రెడ్డి అన్నారు. మొన్న నంద్యాల వచ్చిందని, అక్కడ గెలుస్తున్నామని, ఇప్పుడు కాకినాడలో అడుగు పెట్టిందని, ఇక్కడా గెలుస్తున్నామని టిడిపి నేతలు చెప్పారు.

జగన్ రెండు రోజుల కంటే ఎక్కువ ఉండడు కానీ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత అయిన జగన్ కనీసం రెండు రోజుల కంటే ఎక్కువ తన నియోజకవర్గమైన పులివెందులలో ఉండరని, నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే తన ఉనికి ఉండదనే భయంతో ఎన్నడూ లేనంతగా ఏకంగా 13 రోజుల పాటు ప్రచారం చేశారని టిడిపి కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -