బాలకృష్ణపై రోజా సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు బాలకృష్ణను చంద్రబాబు దారుణంగా మోసం చేస్తారంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణకు సీఎం అయ్యే అవకాశం ఉన్నా.. చంద్రబాబు ఆ పదవిని లాగేసుకున్నారని విమర్శించారు.

ప్రస్తుతం అసలు టీడీపీ లేదనీ.. ఇదో నకిలీ పార్టీ అన్నారు. ఇప్పటికైనా బాలకృష్ణ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మానేయాలని సూచించారు. ఎన్టీఆర్‌ ను చంపిన వాళ్లే ఆయన జన్మదిన వేడుకల పేరుతో హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

కోనసీమకు అంబేడ్కర్‌ పేరుపై ప్రతిపక్షాలు తమ వైఖరీ తెలియజేయాలన్నారు. కోనసీమ విధ్వంసానికి టీడీపీ, జనసేన కార్యకర్తలే కారణమన్నారు.

ఆత్మకూర్ ఉప ఎన్నికల ఎప్పుడంటే ?

తెరపైకి పొలిటికల్ క్లియరెన్స్ అంశం

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

Most Populer

Recent Posts