Tuesday, May 14, 2024
- Advertisement -

అఖిల సంచ‌ల‌నం….

- Advertisement -

స్వ‌ల్ప సంఘ‌ట‌న‌లు మిన‌హా నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో 82 శాతానికి పైగా పోలింగ్ న‌మోద‌య్యింది. అయితే పోలింగ్ శాతం పెర‌గ‌డంచూస్తె అధికార పార్టీపై వ్య‌తిరేక‌త వ్య‌క్తం మ‌య్యింద‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇరు పార్టీలు ముమ్మ‌రంగా ప్ర‌చారం చేశాయి. గెలుపుపై మాదంటె..మాద‌ని ఇరు పార్టీల అభ్య‌ర్తులు ధీమాగా ఉన్నారు.

టీడీపీ మంత్రి అఖిల ప్రియ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముందు తాను ప్రకటించినట్టుగానే ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఓటమి పాలైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి భూమా అఖిలప్రియ ప్రకటించారు. ఇద్దరు చనిపోతే వచ్చిన పదవి, ఆస్తులు త‌న‌కు ముఖ్యం కావ‌ని …భూమా కుటుంభం ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటామ‌న్నారు. అభ్యర్థి ఓటమిపాలైతే రాజీనామాకు సిద్దమేనని ఆమె ప్రకటించారు.

ఉపఎన్నికలను పురస్కరించుకొని టిడిపి అరాచకాలకు పాల్పడిందని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఆరోపించారు. తన సోదరుడు చక్రపాణిరెడ్డిని బలవంతంగా ఇంటి నుండి పంపారని చెప్పారు. చక్రపాణిరెడ్డి బయటకు వెళ్ళిన తర్వాత కూడ పోలీసులు ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డినా సంయ‌మ‌నం పాటించామ‌న్నారు. 28న అంద‌రి భ‌విష్య‌త్తు తేల‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -